హైదరాబాద్: అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల(ఎఇఒ) నియామక పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. వ్యవసాయ శాఖలో మొత్తం 851 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, టిఎస్పిఎస్సి ఎఇఒ ఉద్యోగాలకు 790 మందిని మాత్రమే ఎంపిక చేసింది. అర్హులు లేకపోవడంతో మిగిలిన 61 పోస్టులను భరీ చేయలేదు.