Home తాజా వార్తలు చెన్నైలో గోడను ఢీకొట్టిన విమానం…

చెన్నైలో గోడను ఢీకొట్టిన విమానం…

Aeroplane

చెన్నై: ఎయిరిండియా విమానం  గోడను ఢీకొట్టిన ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో శుక్రవారం వేకువజామున జరిగింది. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎయిరిండియా విమానం చెన్నై నుంచి దుబాయి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయంలో విమానం టెకాఫ్ అయ్యే సమయంలో ప్రహారి గోడను అది ఢీకొట్టింది. దీంతో విమానం అంటీనా పూర్తిగా దెబ్బతినడంతో పాటు విమానం టైర్లు గోడను తాకాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో ఆరుగురు సిబ్బంది, 130 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంబడే ఎటిసితో విమానానికి సిగ్నిల్స్ తెగిపోయాయి. కాసేపటికి సిగ్నల్స్ అందడంతో ప్రయాణీకులను సురక్షితంగా ముంబయి ఎయిర్ పోర్టులో దించారు. అక్కడ నుంచి మరో విమానంలో ప్రయాణీకులు దుబాయ్ కు తరలించారు. ఈ ఘటనపై విమానయాన అధికారులు విచారణ జరుపుతున్నామని, పైలట్లను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. సెప్టెంబర్ 20న జెట్ ఎయిర్‌వేస్ విమానం ముంబై నుంచి జైపూర్‌కు వెళ్తున్నప్పుడు   ముఖ్యంగా క్యాబిన్‌లో గాలి ఒత్తిడిని నియంత్రించే స్విచ్చ్‌ను ఆన్ చేయకపోవడంతో  ప్యాసింజర్లు నెత్తురు చవిచూసిన ఘటన తెలిసిందే.  దీంతో ప్రయాణీకుల ప్రాణాలతో విమానయాన సంస్థలు చెలగాటమాడుతున్నాయని ప్యాసింజర్లు మండిపడుతున్నారు. ఇప్పటికైనా విమానం బయలుదేరే ముందు పైలెట్ ఇతర సాంకేతిక సిబ్బంది యంత్రాలను నిశితంగా పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.

Aeroplane Hit Wall in Tamilnadu

Telangana news