Home తాజా వార్తలు క్రికెటర్ రషీద్ ఖాన్ తండ్రి మృతి

క్రికెటర్ రషీద్ ఖాన్ తండ్రి మృతి

కాబుల్:అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తండ్రి శనివారం మృతి చెందారు. రషీద్ ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్నా డు. తన తండ్రి మరణవార్తతో అతను హుటాహుటిన ఆఫ్గానిస్థాన్ బయలుదేరాడు.
ఈ విషయాన్ని క్రికెటర్ మహ్మద్ నబీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ”ఆఫ్గానిస్థాన్ జాతీయ జట్టు ఆటగాడు.. నా ప్రాణ మిత్రుడు రషీద్ ఖాన్ తండ్రి చనిపోయారని తెలియజేసేందుకు చాలా బాదగా ఉంది. రషీద్, అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అంటూ నబీ ట్వీట్ చేశాడు. కాగా ఈ విషయంపై పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.
Afghan Cricketer Rashid Khan’s father died