Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఉగ్రదాడులపై జనాగ్రహం

int

కాబూల్: అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో అంబులెన్స్ బాంబు పేలుడు జరిగిన ఒక రోజు తర్వాత అక్కడి ప్రజల్లో  తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. శనివారం జరిగిన ఈ ఘటనలో 103మంది మృతి చెందగా, 235మంది గాయపడ్డారు. రాజధానిలో శాంతి, భద్రతలు వేగంగా క్షీణించడం పట్ల సాధారణ అప్ఘన్లు సైతం సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబూల్‌పై తాలిబాన్లు, ఐసిస్‌లు దాడులకు పాల్పడుతూ ఆ నగరాన్ని భయంకరమైన మృత్యు ప్రదేశంగా మార్చడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో బాంబు పేలుళ్లతో తాము తీవ్రంగా ఆం దోళన చెందుతున్నామని, దినచర్యను ఎలా ప్రారంభించా లో అర్థం కావడం లేదని ఫ్రెష్టా కరీం ట్వీట్  చేశారు. మేం ఇంట్లో ఉండాలా లేదా బయటకు వెళ్లలా,మా స్నేహితులను కలుసుకోవాలా, ఏడ్వాలా, మాకు మేం బలవంతగా భరోసా అనే భ్రమలో బ్రతకాలా..మీ దినచర్యను మీరేలా ప్రారంభిస్తున్నారు  అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాబూల్‌లో పేలుళ్లు జరగని రోజంటూ ఏదీ లేదు,అలాంటి రో జంటూ ఉంటే అది ఆశ్చర్యకరమని నజీర్ దనేశ్ ట్వీట్ చేశారు. ఈ పేలుళ్లు ప్రభుత్వానికి అత్యంత అవమానకరమని, ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం మళ్లీ విఫలమైందని నవీద్ ఖదేరి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. పేలుళ్లలో నా యకుల కొడుకో, కూతురో చనిపోయి ఉంటే పేద  ప్రజ ల బాధేంటో అర్థం మవుతుందని ఆయన పేర్కొన్నారు. నగరంలోని యూరోపియన్ యూనియన్ వంటి ఇతర ఉన్నత సంస్థలు, రద్దీగా ఉండే  ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. పేలుడు ధాటికి కొన్ని మీటర్ల దూరం వరకు భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. సమీపంలో చిన్న నిర్మాణాలుకుప్పకూలాయి.మృతుల్లోఎక్కువమంది సాధారణ పౌరులు ఉన్నారు.కాబూల్‌లో అంతర్జాతీయ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంలో 25మంది విదేశీయులు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన వారం తర్వాత మళ్లీ ఉగ్రవాదుల అంబులెన్స్ దాడికి పాల్పడ్డారు.తాలిబాన్ల అనుబంధ సంస్థ హక్కానీ పేలుళ్లకు పాల్పడినట్లు ప్రభు త్వం భావిస్తోంది. అంబులెన్స్ దాడిని డొనాల్డ్ ట్రంప్ సహా అనేక మంది అంతర్జాతీయ నేతలు ఖండించారు.తాలిబాన్ల పై నిర్ణయాత్మక చర్య తీసుకుంటామని ట్రంప్‌పేర్కొన్నారు.

Comments

comments