Home తాజా వార్తలు మళ్లీ అదే తడబాటు..!

మళ్లీ అదే తడబాటు..!

Afghanistan trail by 326 runs with 6 wickets remaining

బెంగళూరు: వేదికగా చిన్నస్వామి స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న చారిత్రాక టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాల్‌ఆన్ ఆడుతున్న అఫ్గాన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడుతోంది. టీమిండియా పదునైన బౌలింగ్ ముందు అఫ్గాన్ బ్యాట్స్‌మెన్లు మరోసారి తేలిపోయారు. ప్రత్యర్థి జట్టు 24 పరుగులకే తొలి 4 కీలక వికెట్లు పారేసుకొని పీకలలోతు కష్టాల్లో పడింది.   365 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గాన్ ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. క్రీజులో షాహిది(03), అస్గర్ స్టానిక్జాయ్(12) ఉండగా… ఇంకా 326 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్‌కు 3 వికెట్లు,  ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు.