Home ఎడిటోరియల్ ఆఫ్రికా వెళ్లండి, కానీ…

ఆఫ్రికా వెళ్లండి, కానీ…

Africaకొద్ది సంవత్సరాల క్రితం తెలుగు ప్రము ఖుడొ కరు ఇక్కడి మోతుబరి రైతులకు, పెట్టుబడి దారులకు ‘చలో ఆఫ్రికా’ అంటూ పిలుపునిచ్చాడు. తను చెప్పిన దాని ప్రకారం అక్కడ ఖాళీ భూములు అంతు లేకుండా ఉన్నాయి. అవి సారవంతమైనవి. అఫ్రికన్లు వా టిని సాగు చేయటం లేదు. వారికాపని చేతకాదు కూడా. వాటిని మనకు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వా లు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. వెళ్లాలే గాని రెండు చేతులా ఆర్జించవచ్చు. ఆ పిలుపు ఇచ్చిన ఆయనకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో మంచి పలుకుబడి కూడా వుంది. దానితో అప్పుడు బయట కొంత కదలిక కూడా కన్పించింది. చివరకు ఎందరు వెళ్లారో, ఎన్ని భూములు సాగు చేస్తున్నారో లెక్కలు మనకు తెలియవు. ప్రభుత్వం ఎప్పుడూ ప్రక టి ంచలేదు. లెక్కలైతే లేవుగాని ఇటీవల కొద్దిమంది మిత్రులతో కలిసి తూర్పు ఆఫ్రికాలోని యుగండా, కెన్యా దేశాలకు వెళ్లినప్పుడు పరిస్థితి కొద్దిగా అర్థ మైంది. అక్కడ విస్తారంగా ఖాళీ భూములు ఉండటం, అవి సారవంతమైనవి కావటం నిజం. తక్కిన వి ష యాలు మాత్రం ఆయన చెప్పిన విధంగా లేవు. ఆ య న పిలుపునిచ్చినప్పటికీ, ఇప్పటికీ మధ్య కాల ంలో ఇతరత్రా మనం విన్న కొన్ని విషయాలను ఇక్కడ చెప్పుకోవాలి. తర్వాత తక్కిన చర్చలోకి వెళ్లవచ్చు. 20 07-08 సంవత్సరాల కాలంలో ప్రపంచ వ్యాప్తం గా ఆహారధాన్యాలు, వాటి ధరలకు సంబంధించి చాలా క్లిష్టమైన స్థితి ఏర్పడింది. ఆ తర్వాత చైనా, కొన్ని అర బ్బు దేశాలు, ఇండియా, కొన్ని మల్టీనేషనల్ కంపె నీలూ ఖాళీ భూముల కోసం ప్రపంచ పటాన్ని గాలిం చాయి. వాటికి కొంత వరకు లాటిన్ అమెరికా, ఆగ్నే యాసియాలలో, చాలా ఎక్కువగా ఆఫ్రికాలో అటు వంటి భూములు కన్పించాయి. దానితో, గోల్డ్ రష్ పద్ధతిలో ల్యాండ్ రష్ మొదలైంది. వేలు, లక్షలు, మిలి యన్ల ఎకరాల లీజుకు తీసుకోవటం మొదలు పె ట్టారు. ఆ పని చేసి ప్రపంచానికి ఆహార కొరత తీర్చగలమని బయటికి ఘనంగా చాటారు. కాని ఆ పేరి ట తమ చేతిలో అంతులేనన్ని ధాన్యం నిల్వలు పెట్టుకోవటం వారి ఉద్దేశం.
ఈ క్రమంలో జరిగిందేమిటి? ఆఫ్రికన్ పాల కులలో అత్యధికులు అవినీతిపరులన్నది తెలిసిందే. వారు తాము తీసుకునేది తాము తీసుకుంటూ, పైకి మా త్రం భూములు వృథాగా పడి ఉండకుండా ఉప యో గంలోకి తేవటం, ఆ క్రమంగా తమదేశాలకు కూ డా లాభం కలగటం అనే మాటలు చెప్పారు. భూములను కారుచవకగా, ఉదాహరణకు ఎన్నోచోట్ల ఎకరానికి సంవత్సరానికి ఒక అమెరికన్ డాలరు ఫీజు చొప్పున లీజులకిచ్చారు. లీజు కాలాలు 33 నుంచి 99 సంవత్సరాల వరకున్నాయి. ఆఫ్రికాలో జన సాంద్రత తక్కువ కావటం నిజమే అయినా, ఆ ఉన్న వారిని కూడా ప్రభుత్వాలు బలవంతంగా ఖాళీ చేయి ంచాయి. ఆఫ్రికన్ కమ్యూనిటీల ప్రజలు ఉన్నచోటనే కూలీలయ్యారు. వారికి ప్రభుత్వాలు స్వతంత్రంగా ఇతర ప్రత్యామ్నాయాలు చూపలేదు. స్వయంగా వ్యవసాయం చేసుకునేందుకు తగిన వనరులు, సాం కేతిక సహాయాలను చూపలేదు. దానితో పలుచోట్ల నిరసనలు ఆరంభమ య్యాయి. మానవహక్కుల సంస్థలు, అంతర్జాతీయ ఎన్‌జిఓలు కూడా రంగ ప్రవేశం చేశాయి. లీజుకు తీసుకున్న వారు కొన్నిచోట్ల దారుణంగా విఫలమయ్యారు. ఉదాహరణకు 2011లో ఈ రచ యిత ఆఫ్రికా వెళ్లి నప్పటికి కెన్యా, ఇ థియోపి యాల లో కలిపి అక్షరాల పదిలక్షల ఎకరా లకు పైగా లీజు కు తీసుకున్న కరు టూరు రామకృష్ణ అనే తెలుగు వ్యక్తి కంపెనీ, ఈ సారి వెళ్లే సరికి ఇంచు మించు దివాళా స్థితికి చేరింది.
ఈ రోజున యుగాండా, కెన్యా రెండింటిలోనూ భూమి గురించి చాలా చర్చ జరుగుతున్నది. యు గాండాలో ఆర్థిక వ్యవస్థ చాలా వరకు ఆసియన్ల చేతిలోకిపోయిన దరిమిలా వారిని ఇదీ అమీన్ బలవంతంగా పారిపోయేట్లు చే శాడు. ఆ తర్వాతి ప్ర భుత్వం 1998లో కొత్త భూమి చ ట్టం చేసింది. భూమికోసం స్థానిక రైతుల నుంచి, స్థానిక ఎన్‌జిఒల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. కెన్యా రాజధాని నైరోబీలో రెండు తరాలుగా స్థిరపడిన ఒక గుజరాతీ పారిశ్రామిక వేత్తల కుటుంబ పెద్ద చం దు షా మాకు చెప్పిన దానిని బట్టి, భూములను బయటి వారికి ఇవ్వటం పట్ల దేశంలో గట్టి వ్యతిరేకత ఉంది. నైరోబీ నేషనల్ మ్యూజియంలో మేమొ వాక్యం గమనిం చాము. ఆ దేశానికి 1963లో స్వాతంత్య్రం లభించిన తర్వాత అతిపెద్ద సమస్య భూమి సమస్య అ య్యింది. మన గాంధీజీతో పోల్చదగ్గ వారి నాయ కుడు జోమో కెన్యాట్టా ప్రభుత్వం అంతర్జాతీయ నిధు లతో తెల్లవారి నుంచి భూములు ఖరీదు చేసి రైతుల కిచ్చింది. కాని అదే క్రమంలో ధనికులు, పలుకుబడి గల పెద్దలకు భారీ ఎత్తున భూములివ్వటం ప్రజలలో తీవ్ర నిరసనకు దారి తీసింది. అప్పటి నుంచి 45 సం వత్సరాలు గడిచినా ఈ భూమి సమస్య ఇంకా పరి ష్కారం కాలేదు. అందువల్ల యుగాండాకు గాని, కె న్యాకు గాని ఖాళీ భూములున్నాయంటూ పరుగు లు తీయదలచుకునేవారు ఈ నేపథ్యాలను, వర్త మానపు వా స్తవిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకో వలసి ఉంటుంది.
అక్కడే చిరకాలంగా స్థిరపడి ఉన్న భారతీయులు ఒక స్థాయిలో భూములు ఖరీదు చేయటం, లీజుకు తీసు కోకపోవటం వేరు. వారు అక్కడి సమాజాలలో ఇంచుమించుగానో, పూర్తిగానో భాగమయ్యారు. ఇటువంటి వారు మాకూ కన్పించారు. అది గాక కొ త్తగా వెళ్లినా కొద్ది మొత్తంగా లీజుకు తీసుకోవటం కూ డా అక్కడి ప్రజలకు కనీసం ప్రస్తుతానికి వ్యతిరేకత కలిగించకపోవచ్చు. ఎందుకంటే అవి ప్రభుత్వ భూములు కావటం, వనరుల కొరత రీత్యా స్థాని కులు ఇంకా వాటిని సాగు చే యగల స్థితి లో లేకపోవటం వంటివి అందుకు కారణాలు. ఆ విధం గా ఇది సంధికాలం వం టిదన్నమాట. ము న్ముందు అక్కడి ప్రజ లు తమ భూములను తామే సాగుచేసు కోగల స్థితి వచ్చిన కొద్దీ ఈ దిశలోనూ బయటివారిపైన, అ క్కడి ప్రభు త్వాలపైన ఒ త్తిడి పెరిగితే ఆశ్చ ర్య పడ నక్కరలేదు. కనుక ఇవన్నీ గుర్తుంచుకోవాలి. అక్కడ స్థిరపడి పో యిన భారతీయు లకు, నల్లవారికి మధ్య కూడా ధనిక- పేద తారత మ్యాలు, భారతీ యు లు వారితో సరిగ్గా కలవక పోవటం వంటి కార ణాల వల్ల మంద్ర స్థా యిలో పరో క్షం గానో, అంతకు మిం చిన స్థాయి లో ప్రత్యక్షంగానోఉద్రిక్తతలున్నమాట ని జం. ఇది నేరాలకూ కారణమవుతున్నది. ఉదా హర ణకు మా తోపాటు కంపాలాలో విందులో పాల్గొన్న తెలు గు వాడైన సంజీవ్ అనే ముఖ్య వ్యాపారిని, త ర్వాత కొద్ది రోజులకే ఆయన ఆఫ్రికన్ బాడీగార్డ్ కేవ లం పదివేల యుగాండన్ షిల్లింగ్స్ కోసం కాల్చి చం పాడు. ఆ సొ మ్ము సుమారు రెండువందల భార తీయ రూ పాయలకు సమానమంటే నమ్మలేము. దీనిని బ ట్టి పరిస్థితి నాజూకుతనాన్ని కొంత ఊహిం చవచ్చు.
ఆఫ్రికాలో ఖాళీ భూములు, అవి మహా సారవ ంతం కావటం, నీటికి ఎటువంటి కొరత లేకపోవటం నిజం. కాని ఆఫ్రికన్లు కోరుకునేది వాటిని ఇతరులు య థేచ్ఛగా ఆక్రమించుకుని కొత్తవలసవాదులు కా వటం కాదు. అది అక్కడి పాలకులకు సమస్య కాదు గాని ప్రజలకు సమస్యే. వారికి కావలసింది తమ భూ మిని, ఇతర వనరులను తాము ఉపయోగిం చుకుని పేదరికం నుంచి బయటపడటం. అందుకు ఆర్థిక వన రులు, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రసామాగ్రి కా వాలి. వాటిని సమకూర్చే కృషిని తమ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చేయాలి. బయటివారు చలో ల్యాండ్ రష్ దృష్టితో గాక వారితో భాగస్వాములయేందుకు వెళితే స్వాగతిస్తారు.వనరులు, పరిజ్ఞానం, యంత్రాలు ఎవ రూ ఉచితంగా సమకూర్చరు. సమకూర్చుతారని, సమకూ ర్చాలని అనుకోవటం శుష్క ఆదర్శవాదమవు తుంది. కనుక ఆచరణాత్మక దృష్టి అవసరం. అది అక్క డి వారికుంది. బయటివారికి కూడా దురాశలు గాక భాగస్వామ్యపు దృష్టి ఉంటే సమస్యలు రావు. అది ఉభయ తారకమవుతుంది. ఆఫ్రికన్లు కొత్త వలస ప్రభువులను వద్దంటున్నారు గాని, భాగస్వాములను వద్దనటంలేదు.సాంకేతికతోడ్పాటును వ్యతిరేకించట ం లేదు. ఉదాహరణకు లోగడ ఐక్య రాజ్య సమి తిలో చిరకాల అనుభవంగల డాక్టర్ భిక్షం అనే ఒక తెలుగు జలవనరులు,వ్యవసాయ నిపుణుడు నిర్వహించే ‘అగ్ శ్రీ’ అనే సంస్థకు ఆఫ్రికా వ్యాప్తంగా ఆద రణ ఉంది. పోతే పరిశ్రమలు, పెద్ద వ్యాపారాలలో అనేకానేకం భారతీయుల చేతిలో ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో ఆర ంభమైన ఈ క్రమం ఇప్పటికీ కొనసా గుతున్నది. అం దులోనూ వేర్వేరు స్థాయిలలో ఉద్రిక్త తలు న్నాయి. అందుకు పరిష్కారాలు భాగస్వామ్యాలు. వారికి సొ ం త వనరులు పరిమితం గనుక ఆమే ర కు మాత్రం భారతీయుల భాగస్వామ్యానికి ఆరో గ్య క రమైన అవకాశాలున్నాయి. అదే విధంగా సర్వీసు రంగం.
-9848191767