Home అంతర్జాతీయ వార్తలు ఆఫ్రికన్ ఏనుగు దంతాలు సీజ్

ఆఫ్రికన్ ఏనుగు దంతాలు సీజ్

ELEPHANT

బ్యాంకాక్ : భారీ పరిమాణంలో ఉన్న ఆఫ్రికన్ ఏనుగు దంతాలను థాయ్‌లాండ్ పోలీసులు పట్టుకున్నారు. చైనాలో ఏనుగు దంతాలకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో చైనాకు అక్రమంగా తరలించేందుకు 148 కిలోల బరువు ఉన్న ఏనుగు దంతాలను సిద్ధం చేశారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వారు దాడి చేసి ఈ ఏనుగు దంతాలను సీజ్ చేశారు. ఈ ఏనుగు దంతాల విలువ మార్కెట్‌లో రూ.2కోట్ల 86 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు థాయ్‌లాండ్ పోలీసులు తెలిపారు.

African Elephant Teeth Seized