Search
Wednesday 21 November 2018
  • :
  • :

అంచనాలను మించింది

After three quarters, SBI is the gainer

మూడు త్రైమాసికాల తర్వాత లాభాల్లోకి ఎస్‌బిఐ

క్యూ2లో నికర లాభం రూ.945 కోట్లు

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ మూడు త్రైమాసికాల తర్వాత మళ్లీ లాభాల్లోకి అడుగుపెట్టింది. లాభాలు, తక్కువ కేటాయింపుల సహాయంతో బ్యాంక్ లాభాల బాటపట్టింది. సెప్టెంబర్ 30 ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నికర లాభం రూ.945 కోట్లతో 40 శాతం క్షీణించింది. గతేడాది ఇదే సమయంలో లాభం రూ.1,581 కోట్లుగా ఉంది. ఈమేరకు బ్యాంక్ ఎక్సేంజ్ ఫైలింగ్‌లో వివరాలను తెలిపింది. అయితే బ్యాంక్ లాభం రూ.775 కోట్లు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ అంచనాలను బ్యాంక్ అధిగమించింది. ఎస్‌బిఐ మొత్తం ఆదాయం రూ.65,429 కోట్ల నుంచి రూ.66,607 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలకు కేటాయింపులు గతేడాదిలో రూ.10,185 కోట్ల నుంచి ఈసారి 39 శాతానికి తగ్గుముఖం పట్టాయి.

నికర వడ్డీ ఆదాయం రూ.20,905 కోట్లతో 12 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.18,585 కోట్లుగా నమోదయ్యింది. వడ్డీ మార్జిన్లు 2.67 శాతం నుంచి 2.76 శాతంతో విస్తృతమయ్యాయి. బ్యాంక్ ఆస్తుల నాణ్యత మెరుగైంది. సెప్టెంబర్ ముగింపు నాటి త్రైమాసికంలో ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) 9.95 శాతానికి తగ్గింది. ఇంతకుముందు క్యూ1(ఏప్రిల్‌జూన్)లో 10.69 శాతంగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరం(201718) రెండో త్రైమాసికంలో 9.83 శాతంగా ఉంది. రైటాఫ్ ఖాతాల్లో రికవరీ రూ.1,327 కోట్లతో 14.6 శాతానికి పెరిగిందని బ్యాంక్ వెల్లడించింది. లిక్విడిటీ కవరేజ్ రేషియో 140 శాతంగా ఉంది.

త్రైమాసిక పరంగా స్థూల స్లిపేజ్‌లు రూ.14,349 కోట్ల నుంచి రూ.10,888 కోట్లకు తగ్గాయి. నికర స్లిపేజ్‌లు రూ.10,725 కోట్లుగా ఉంది. క్యూ2 స్లిపేజ్ రేషియో 2 శాతంగా, క్యూ1లో 1.95 శాతంగా ఉంది. ఎస్‌బిఐ చైర్మన్ రజనీశ్ కుమార్ మాట్లాడుతూ, లాభం మితంగా ఉన్నప్పటికీ వెనక్కి చూడడం లేదని అన్నారు. ఇక్కడి నుంచి గణాంకాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు. కాగా ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఎస్‌బిఐ షేరు ధర 3.45 శాతం లాభపడి రూ.295 వద్ద ముగిసింది. క్యూ2 ఫలితాలు వెల్లడి అవుతున్న సమయంలో షేరు ధర రూ.300ని కూడా తాకింది.

After three quarters, SBI is the gainer

Telangana Latest News

Comments

comments