Home తాజా వార్తలు మళ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం..

మళ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం..

test

దోహా: ప్రపంచ క్రికెట్‌లో మరోసారి ఫిక్సింగ్ ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గల్ఫ్‌కు చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్ అల్ జజీరా తన స్టింగ్ ఆపరేషన్‌లో ఫిక్సింగ్ జరిగినట్టు తేలిందని సంచలన ఆరోపణలు చేసింది. క్రికెట్‌లో అవినీతిపై తాము నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు ఫిక్సింగ్‌కు గురైనట్టు తేలిందని పేర్కొంది. గత రెండేళ్ల కాలంలో భారత్ ఆయా దేశాలతో ఆడిన మూడు టెస్టులు ఫిక్సింగ్ కోరల్లో చిక్కుకున్నట్టు తమ పరిశోధనలో తేలిందని స్పష్టం చేసింది. 2017లో శ్రీలంకలోని గాలే స్టేడియంలో భారత్‌లంక జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్, 2017లో రాంచీలో భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్, 2016 డిసెంబర్‌లో ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్ ఫిక్సింగ్‌కు గురైందని అల్ జజీరా ఛానల్ పేర్కొంది. ఇందులో రెండు టెస్టుల్లో భారత్ విజయం సాధించగా, రాంచీ టెస్టు డ్రాగా ముగిసింది. కాగా, రాంచీ టెస్టులో ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఛానల్ వెల్లడించింది. ఇక చెన్నైలో జరిగిన టెస్టులో ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తమ స్టింగ్ ఆపరేషన్‌లో తేలిందని ఆ ఛానల్ ప్రకటించింది. ఇదిలావుండగా ఈ ఆరోపణలను ఇంగ్లాండ్ క్రికెటర్లు ఖండించారు. అయితే ఆస్ట్రేలియా ఆ టగాళ్లు ఇంత వరకు దీనిపై స్పందించలేదు. మరోవై పు ఈ ఆరోపణలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) విచారణ ప్రారంభించింది.