Home భద్రాద్రి కొత్తగూడెం నాణ్యతకు తూట్లు

నాణ్యతకు తూట్లు

  • నాసిరకంగా అంగన్‌వాడీ భవన నిర్మాణం
  • పట్టించుకోని అధికారులు

Quality-Aganwadi

లక్ష్మీదేవిపల్లి : లక్ష్మీదేవిపల్లి పంచాయతీ పరిధిలోని అశోక్‌నగర్‌కాలనీలో అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. ముఖ్యంగా నిర్మాణాల్లో సరైన నాణ్యతను పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హయాంలో సుమారు 4లక్షల రూపాయలతో అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు మొదలు కావడం జరిగింది. నిధుల కొరత కారణంగా కొంత కాలంపాటు పనులు కొనసాగలేదని ఆప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో మరోదఫా సుమారు 3 లక్షల రూపాయలు మంజూరుకావడంతో పెం డింగ్ పడిన పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే పనుల్లో నాణ్యత గల కంకర, ఇసుక, సిమెంట్ వాడడంలేదని స్థానికుల నుండి విమర్శలు వస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకనే నాసిరకం పనులు జరుగుతున్నాయని కాలనీ వాసులు ఆరోపించడం గమనించాల్సిన విషయం. రెండు సంవత్సరాలకుపైగా కావస్తున్న ఇంత వరకు అంగన్‌వాడీ బిల్డింగ్ నిర్మాణాలు పూర్తికాక పోవడం విమర్శలకు దారితీస్తోంది. తక్షణం ఉన్నతాధి కారులు స్పందించి అంగన్‌వాడీ బిల్డింగ్ నిర్మాణం వద్ద ఇంజనీరింగ్ పర్యవేక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకో వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి బిల్డింగ్‌కు నీటి సదుపాయం, విద్యుత్, మరుగుదొడ్లతో పాటు తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.