Home నిర్మల్ అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

  • 52 కేంద్రాలకు 14 భవనాలు
  • పిల్లలు, అంగన్‌వాడీ టీచర్లకు ఇబ్బందులు
  • ఇరుకు గదుల్లో అసౌకర్యంగా విధుల నిర్వహణ

Aganwadi-Centres

భైంసా : ఐసిడిఎస్ పరిధిలోని అంగన్‌వాడి కేంద్రాలలో సరైన సదుపాయాలు లేకపోవడంతో అంగన్‌వాడి కేంద్రాలలో పిల్లలకు, అంగన్‌వాడి టీచర్లకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండలంలోని 52 అంగన్‌వాడి కేంద్రాలుండా వాటిలో 14 మాత్రమే స్వంత భవనాలు కలిగి ఉన్నాయి. గత ఏడాది ఆర్‌ఐడిఎస్ కింద మిర్జాపూర్, సుంక్లీ, హజ్గుల్, బిజ్జూర్, అంపోలి, వట్టోలి గ్రామాలకు ఈడిఐఎస్ నిధుల కింద దేగాం, కామోల్, సిద్దూర్, చింతల్‌బోరి, కేంద్రాలకు ఒక్కక్క భవనానికి 6 లక్షలు మంజూరైనప్పటికీ ఇప్పటికీ పనుల ప్రారంభించకపోవడంతో ఎప్పుడు ప్రారంభిస్తారని, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిధులు సరిపోక పోవడంతో ప్రారంభించిన పనులు మద్యలోనే ఆగిపోయాయి. మిగిలిన అంగన్‌వాడి కేంద్రాలు స్వంత భవనాలు లేకపోవడంతో గ్రామంలోని గధులను అద్దెకు తీసుకుని, నిర్వహిస్తున్నప్పటికీ వాటిలో సరైన సదుపాయాలు లేకపోవడంతో నిర్వాహకులు తొందరగా భవనాలను పూర్తి చేయాలని, అధికారులను కోరుతున్నారు. చాలి చాలని అద్దె ఇవ్వడంతో గ్రామాల్లో గధులు దొరకడం గగనమై పోయింది. అద్దెకు తీసకున్న భవనాల్లో ముఖ్యంగా మరుగుదొడ్ల సదుపాయం, స్నానపు గదుల సదుపాయం ఉండడం లేదు. అంగన్‌వాడి కేంద్రాలకు వచ్చే పౌష్టికాహారం ఇతర వస్తువులను అంగన్‌వాడి ఉపాద్యాయురాల్లు, అద్దె భవనాల్లో సరిపోక పోవడంతో తమ ఇండ్లలోనే వాటిని ఉంచుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, నిలిచిపోయిన అంగన్‌వాడి పనులు ప్రారంబించి, వాటిని పూర్తి చేయాలని, అధికారులను కోరుతున్నారు.
స్వంత భవనాలు లేక ఇబ్బందులు : విమల(అంగన్‌వాడి ఉపాధ్యాయురాలు)
ప్రభుత్వం ఇస్తున్న రూ.750కు గధులు అద్దెకు దొరకడం చాలా కష్టంగా ఉందని, అంగన్‌వాడి కేంద్రాల్లో పెట్టే మద్యాహ్న భోజనం నిర్వాహణకు గర్బిణీలు, బాలింతలు, పిల్లలు, సరైన సౌకర్యాలు లేక అసౌకర్యానికి గురవుతున్నారు.