Home వార్తలు ఐటిలో వయసు పోరాటం

ఐటిలో వయసు పోరాటం

IT-Sectorయువత మీద కూడా వయసు సంబంధిత సమస్య ప్రభావం ఉంటుంది. ఎంట్రీ లెవల్ వర్కర్ల మీద కూడా ఉంటుంది. రిక్రూట్ అవగానే తోటి కొలీగ్స్‌తో సమానంగా పనిచేసే అనుభవం కాని సామర్థం కాని ఉండవు. పని నేర్చుకునే లోపు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

టెక్నాలజీ ఉద్యోగాలన్నీ కేవలం యువత కోసమే. వయసు పెరిగితే ఈ రంగంలో అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. సిలికాన్ వ్యాలీ బిజినెస్ జర్నల్, వైవిధ్యం కోసం పోరాడాలి అంటుంది. నిజానికి కొన్నేళ్ల కిందట స్టాన్‌ఫర్డ్‌లో ఒక సందర్భంలో, ఫేస్‌బుక్ మార్క్ జుకంబర్గ్ ఇలా అన్నాడు. ‘ ఐటి రంగంలో యువత మాత్రమే టెక్నికల్ అయి ఉండటాన్ని నేను నొక్కి వక్కాణిస్తున్నాను. ఎందుకంటే యువత మాత్రమే ఎక్కువ తెలివైనవారు.’ అతను చెప్పిన ఆ కొటేషన్ అప్పుడు మీడియాలో ఎక్కువ తిరిగింది. మార్గదర్శకంగా తీసుకుంటుంది ఐటి పరిశ్రమ. అప్పుడు సిలికాన్ వ్యాలీ, యువత ప్రాముఖ్యత గురించి రాసింది. అప్పుడు సిలికాన్ వ్యాలీ చేపట్టిన యూత్ మూవ్‌మెంట్ ఒకరకంగా డబ్బు ఆదా చేసే ప్రణాళిక. అనుభవం, వయసు పెరిగిన వారికి మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తుందన్నది దాని యోచన. అయితే యువత పోల్చి చూస్తే తెలివైనవాళ్లని చెప్పిన జుకంబర్గ్ పాయింట్‌ని కూడా ఇంకోసారి తరచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యువత చాలా తెలివైన వాళ్లనడం తప్పని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ విషయంలో చాలావరకు బయాలజీ మీద ఆధారపడిందే. మరీ ముసలివాళ్లయితే తప్ప బ్రెయిన్ పెరగడం ఎప్పటికీ ఆగిపోదు. నిజానికి వయసు పెరిగేకొద్దీ మరింత చురుగ్గా మైండ్ తయారవుతుంది. అంటే, మనుషుల సాఫ్ట్, హార్డ్, రెండు నైపుణ్యాలు పెరుగుతూ వెళ్తాయి. అవి వయసుతోపాటే అభివృద్ధి చెందుతాయి.

టెక్నాలజీ కోసం కేవలం యువతరం మాత్రమే పనికివస్తారని ముద్ర పడిపోయింది. వయసు పెరిగేకొద్దీ టెక్నాలజీ రంగంలో ఉద్యోగం సంపాదించుకోవడం కష్టం అవుతుంది. రిక్రూటర్లను, మేనేజర్లని రిక్రూట్ చేసుకోవడం, జెండర్, జాతి, చదువు, పని అనుభవం, వీటిని పరిగణనలోకి తీసుకోవడం, వీటితోపాటు 30 ఏళ్ల లోపు ఉన్న వయసును పరిగణనలోకి తీసుకునే మూసపోసిన ముద్ర నుంచి బయటకు రావాల్సి ఉంది. యువత మీద కూడా వయసు సంబంధిత సమస్య ప్రభావం ఉంటుంది. ఎంట్రీ లెవల్ వర్కర్ల మీద కూడా ఉంటుంది. రిక్రూట్ అవగానే తోటి కొలీగ్స్‌తో సమానంగా పనిచేసే అనుభవం కాని సామర్థం కాని ఉండవు. పని నేర్చుకునే లోపు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాఫీ తెచ్చి ఇచ్చే అటెండర్‌ల నుంచి అడ్మినిస్ట్రేటివ్ పని చేసేవాళ్ల వరకు 50 ఏళ్ల పైన వయసు ఉన్నవారు ఉంటారు. అలాటప్పుడు ఐటిలో మాత్రమే ఈ వివక్ష ఎందుకు? వయసు పెరిగిన కారణంగా ఐటి కంపెనీలో తమ మీద నమ్మకం తగ్గడం లేదా ట్రీట్‌మెంట్‌లో తేడా ఉంటే ఎలా పనిచేయగలుగుతారు? అయితే ఎప్పటికప్పుడు నేర్చుకునే తత్వాన్ని విడవకుండా ఉండాలి. నైపుణ్యాలను పెంచుకుని నిరూపించుకోవాలి. అప్పుడే వారి కెరీర్ కొంత భద్రత కలిగి ఉంటుంది.

ఆ ప్రోగ్రామ్‌లను వదలకూడదు
నిరంతరం నేర్చుకుంటూనే ఉండే తత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దానికి చాలామార్గాలున్నాయి. కోడింగ్ బూట్ క్యాంపులు, కమ్యూనిటీ కాలేజీలు, ఇంటర్న్‌షిప్‌లు, ఇలా చాలా అవకాశాలుంటాయి. కొన్ని కంపెనీలు, వారి ఉద్యోగులు జాబ్ షేరింగ్, వర్క్ షేరింగ్ ప్రోగ్రామ్‌లు పెట్టి వారు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు నేర్చుకోడానికి సబ్బాటికల్ (ఎక్కువ రోజులు)సెలవులిస్తాయి. అప్పుడు ఏదయినా కోర్సులు నేర్చుకోవచ్చు. అటువంటి ప్రోగ్రామ్‌ల వల లబ్ది పొందచ్చు. వయసుతో సంబంధం లేకుండా ఉద్యోగుల సామర్థం పెంచడానికి సర్టిఫికేషన్లు చేసే అవకాశం కల్పిస్తాయి కంపెనీలు. వాటిని ఉపయోగించుకోవాలి. సర్టిఫికేషన్ అధికారికంగా మీకున్న నైపుణ్యాలను, అనుభవాన్ని తెలుపుతుంది.

నెట్‌వర్క్
నెట్‌వర్క్‌ను పెంచుకోవాలి. వారికి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్లు కూడా ముందు ముందు సహాయకారిగా ఉంటాయి. తమ లాగే ఆలోచించే కొలీగ్స్‌తో, స్నేహి తులతో నైతిక మద్దతు, మార్గదర్శకత్వం తీసుకో వడం వలన ఉద్యోగులు ప్రొఫెషనల్ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. స్వచ్ఛందంగా పనిచేయడం కూడా నైపుణ్యాలను అప్‌టుడేట్ చేసుకోడానికి ఉపయో గపడుతుంది. దానివల్ల ఒక్క సాఫ్‌టవేర్ రంగంలోనే కాకుండా ఇతర రంగాలలోనూ తాము పనిచేయగ లమనే ఆత్మవిశ్వాసం వస్తుంది. వివిధ బ్యాక్‌గ్రౌండ్ లు న్న ఉద్యోగులు, స్నేహితులు, కొలీగ్స్‌తో కలిసి పని చేసే అవకాశం వస్తుంది. రకరకాల వయ సువారు, జండర్ వారితో కలిసి పనిచేసే అవకాశాన్ని కూడా పొందు తారు. భవిష్యత్తులో కెరీర్ సులువుగా ఉంటుంది.

నాయకత్వం పెంచుకోవాలి
ఎవరైతే ఈ యువత ఆధారితంగా పనిచేసే ఐటి రంగంలో ఎక్కువ కాలం ఉండటం ఇష్టపడరో వారు, ఫ్రీలాన్సింగ్, బ్లాగింగ్, మాట్లాడటం, సంప్రదించడం, ఇవన్నీ కూడా ఐటి ప్రొఫెషనల్స్‌కి పనిచేయడానికి అవకాశాలు పొందచ్చు. దీనివలన ఇతర కమ్యూనిటీ లతో కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఈ డైవర్సిటీ మీద పనిచేయాల నుకుంటున్న కంపెనీలు ఈ విష యంపై సమయాన్ని, శక్తిని సరైన తీరులో వినియోగించాలి. మార్పులు రాత్రికి రాత్రే సంభవిం చవు కాని కొంత సమయం తీసుకుని ఒక కొలిక్కి తప్పకుండా వస్తాయి.