Home తాజా వార్తలు టాలీవుడ్ తోపు టీజర్ ఇదేనట…

టాలీవుడ్ తోపు టీజర్ ఇదేనట…

Pawan-Kalyan

హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టేసింది. శనివారం సాయంత్రం విడుదలైన అజ్ఞాతవాసి టీజర్ టాలీవుడ్‌లో అత్యధిక మంది లైక్ చేసిన టీజర్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఈ టీజర్‌కు ఏకంగా 3,65,000కు పైగా లైక్‌లు వచ్చాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కాంబోలో ఇంతకుముందు జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో అజ్ఞాతవాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటికి తోడు తాజాగా విడుదలైన టీజర్ మరింత అంచనాలు పెంచేసింది. ఈ నెల 19న ఆడియో విడుదల చేసి, సంక్రాంతి కానుకగా జనవరి 10న మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.