Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

వ్యవసాయ బడ్జెట్‌కు మూడు రెట్లు పంటకోత, అనంతర నష్టాలు

Cold-storageపంట కోత కాలంలో, అనంతర కాలంలో మనదేశ ప్రధాన ఆహా రోత్పత్తికి జరుగుతున్న నష్టం రూ.92,651 కోట్లు(13 బిలియన్ డాలర్లు). ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆగస్టు 9న ప్రచురించిన సమాచారం ఈ విషయాన్ని తెలియజేసింది. వ్యవసాయ రంగానికి కొత్త బడ్జెట్ కేటాయింపుకు ఇది మూడు రెట్లు. 2015-16 లో వ్యవసాయ బడ్జెట్ రూ.24,909 కోట్లు (4 బిలియన్ డాలర్లు) కాగా 2016-17 బడ్జెట్‌లో దీన్ని రూ.35,984కోట్లకు (5 బిలియన్ డాలర్లు) పెంచారు. 2012-14 సంవత్సరాల మధ్య కూరగాయల ఉత్పత్తిలో 16 శాతం – అనగా రూ.40,811 కోట్ల విలువైన ఉత్పత్తి నష్టపోయినట్లు ఉత్పత్తి విశ్లేషణ తెలుపుతున్నది. పంట అనంతర ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ (లూథియానా) టోకు ధరల ప్రాతిపదికగా ఈ అంచనా వేసింది. మాంసం స్టోరేజిలో 7 శాతం (రూ.3942 కోట్లు) నష్టపోయినట్లు కూడా ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వశాఖ తెలిపింది.
సరఫరా గొలుసు నష్టాలు అరికట్టటానికై 2007-2014 మధ్య నాలుగు కేంద్ర కార్యక్రమాల కింద దాదాపు ఏడువేల కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటికైన ఖర్చు రూ.2395 కోట్లు. 2014-16 మధ్య మరో 609 ప్రాజెక్టులు మంజూరైనాయి.వాటికి సబ్సిడీ రూ. 660కోట్లు.
కోల్డ్ స్టోరేజీలపై చాలా ఎక్కువ ధనం ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్-చైన్ డెవలప్‌మెంట్ అభిప్రాయ పడు తోంది. కాగా కోల్డ్‌చైన్ వ్యవస్థలో మూడు విభాగాలకు- ప్యాకింగ్ హౌస్ లు, పండించే చాంబర్లు, శీతల వాహనాలు- ఏ మాత్రం నిధులు అంద టం లేదని అఖిలభారత కోల్డ్ చైన్ మౌలిక వసతుల సామర్థం నివేదిక, 2015 తెలిపింది.కాబట్టి దిద్దుబాటు చర్యల ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Comments

comments