Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యవసాయ విధాన సారథి అవార్డు

5న ఢిల్లీలో ప్రదానం చేయనున్న భారత ఆహార వ్యవసాయ మండలి

KCR

హైదరాబాద్: ప్రతిష్టాత్మ క అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డు కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎం పికయ్యారు. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ ‘పాలసీ లీడర్ షిప్’ విభాగం కింద సిఎం కెసిఆర్ పేరును ప్రతిపాదించారు. భారత ఆహార వ్యవసాయ మండలి ఆధ్వర్యంలో సెప్టెంబరు 5న ఢిల్లీలోని తాజ్‌ప్యాలస్‌లో జరిగే కార్యక్రమంలో అవా ర్డు ప్రదానం చేస్తారు. వ్యవసాయ, గ్రామీణ అవృద్ధికి కృషి చేసేవారికి భారత ఆహార వ్యవసాయ మండలి 2008 నుంచి అవార్డును అందజేస్తుంది. లక్షలాది మంది వ్యవసాయదారుల జీవితాల్లో మార్పు కోసం విభిన్న పథకాలతో కృషి చేస్తున్నందుకు సిఎం కెసిఆర్‌కు అవార్డు అందజేస్తున్నామని వ్యవసాయ, ఆహార మండలి ప్రకటించింది.
గవర్నర్, మంత్రుల హర్షం: వ్యవసాయ, ఆహార మండలి పురస్కారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దక్కడంపై గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ అభివృద్ధిపై, వినూత్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సిఎం చేస్తున్న కృషికి గుర్తింపుగా అవార్డు దక్కిందని ప్రశంసించారు. సిఎం కెసిఆర్‌కు ప్రతిష్టాత్మక వ్యవసాయ పురస్కారం లభించడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. 2008 నుంచి భారత ఆహార మండలి అవార్డులు ప్రధానం చేస్తోందని, తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అవార్డు దక్కడం, ఆయన కృషికి, కష్టానికి లభించిన గుర్తింపు అని తుమ్మల ప్రశంసించారు. బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకే సగం కేటాయించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రైతులు, వారి సమస్యలపై పూర్తి అవగాహన ఉందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Comments

comments