Search
Wednesday 14 November 2018
  • :
  • :

వ్యవసాయ మార్కెట్ కమిటీల రిజర్వేషన్లు ఖరారు

Untitled-1సంగారెడ్డి/సిద్దిపేట, : ఏడాదిన్నరగా నామినేటెడ్ పోస్టుల కోసం వేచి చూసిన గులాబీ నాయకులకు మంగళవారం ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీ లకు రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశా వాదుల్లో ఆశలు చిగురించా యి. గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించినట్లు గానే నామినేటెడ్ పోస్టులకు రిజర్వేషన్లతో విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 18 పాత మార్కెట్ కమిటీలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన సిద్దిపేట నియోజ కవర్గంలోని నంగునూరు, చిన్నకోడూరు, మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజ కవర్గంలోని కొండపాక వ్యవసాయ మార్కెట్‌లతో కలిపి మొత్తం 22 కమిటీలకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఓసి కోటాలో 15 వ్యవసాయ మార్కెట్ లు చేరగా, బిసి కోటాలో 4, ఎస్టీ కోటాలో 2, ఎస్సీ కోటాలో 1 కమిటీని రిజర్వేషన్ చేయడం జరిగింది. జిల్లాలో పెద్ద వ్యవసాయ మార్కెట్‌లు గా ఉన్న సిద్దిపేట, సంగారెడ్డి, గజ్వేల్, రామాయంపేట, జహీరాబాద్, మెదక్, నారాయణఖేడ్‌లతో పాటు దుబ్బాక, రాయకోడ్, వట్‌పల్లి, చేగుంట, మిర్‌దొడ్డి, దౌల్తాబాద్, కొండపాక, చిన్నకోడూరు ఓసి ఖాతాలో చేరగా, నంగునూ రు, సదాశివపేట, వంటిమామిడి, జోగిపేట బిసి కోటాలో చేరాయి. నర్సాపూర్, పాపన్నపేట వ్యవసాయ మార్కెట్‌లు ఎస్టీ కోటాలో చేరగా, జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలోని ఒకే ఒక్క తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వు డు అయింది. ఎప్పుడెప్పుడో అంటూ ఎదురు చూసిన టిఆర్‌ఎస్ నాయకులకు నేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ లకు రిజర్వేషన్లు ప్రకటించడంతో రిజర్వేషన్లు అనుకూలిం చిన నాయకులు తమకే పదవి కావాలంటూ ప్రయత్నాల్లో మునిగి పోయారు. జిల్లాలో 22 మార్కెట్ కమిటీలలో 15 వరకు ఓసి కోటాలో చేరడం, ఎస్సీ కోటాలో ఒకే ఒక క మిటీకి అవకాశం రావడంతో రిజర్వేషన్లపై ఆశ పెట్టుకొన్న సామాజిక వర్గాలకు చెందిన టిఆర్‌ఎస్ నాయకులు ఒకింత నిరాశకు లోనయ్యారు. ఇక మార్కెట్ కమిటీలపై త్వరలో భర్తీ చేస్తారనే ప్రకటనల గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటనలు ఇవ్వడంతో గతంలోనే మార్కెట్ కమిటీ చైర్మన్‌ల కోసం జిల్లాకు చెందిన మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో పాటు డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యేలకు ఆశావాదులు బయోడే టాను సమర్పించడం జరిగింది. సర్పంచ్, ఎంపిటిసిలుగా రిజర్వేషన్ అనుకూ లించక, సీనియర్ నాయకులుగా ఉన్న నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్‌లపై భారీ ఆశలు పెట్టుకొన్నారు. జిల్లా మొత్తంలో తొగుట ఎస్సీ రిజర్వుడు కావడంతో పదవిపై గంపెడాశ లు పెట్టుకున్న నాయకులు ఖంగు తిన్నారు. రిజర్వేషన్ల ఖరారుతో టిఆర్‌ఎస్‌లో రాజకీ యాలు వేడెక్కాయి. మరి ఎవరికి చైర్మన్ పదవులు లభిస్తాయో…ఎవరికి మోదం ఎదుర వుతుందో ఎదురు చూడాల్సిందే.. ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో మిగతా వారిని బుజ్జగించడం ఎమ్మెల్యేలకు ఒకింత కష్టమే అని చెప్పక తప్పదు.

Comments

comments