Search
Wednesday 26 September 2018
  • :
  • :

వ్యవసాయ అధికారులకు సమయ పాలనేది?

ఇబ్బందులకు గురవుతున్న రైతులు, పట్టించుకోని ఉన్నత అధికారులు

                       Telangana

కుభీర్ : కుభీర్ మండల వ్యవసాయ అధికారులు సమయపాలన పాటించడం లేదని పలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు వదులుకుని గంటల తరబడి కార్యాలయాల ముందు వేచి చూడాల్సి వస్తుందంటున్నారు. శనివారం వ్యవసాయ కార్యాలయం కు ఉదయం గం. 11:30 నిమిషాల వరకు ఏ ఒక్క అధికారి విధులకు హాజరుకాలేదు. సోయా విత్తనాల కూపన్‌లకై మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన రైతులు కార్యాలయం ముందు పడిగాపులు కాచారు. ఉదయం 10 గంటలకు  పనులు వదులుకుని కార్యాలయంకు వచ్చిన కార్యాలయం తలుపులు తెరవకపోవడంతో కార్యాలయం ముందే పడిగాపులు గాచారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ  కింది స్థాయి అధికారులు సకాలంలో కార్యాలయంకు హాజరు కావడం లేదు. ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలు ఉన్నాయని విధులకు డుమ్మా కొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు వర్షాలు కురుస్తండడం వల్ల ఇది వారికి విలువైన సమయం వృథా అవుతుందని వాపొతున్నారు. చాలా ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వ్యవసాయ అధికారులు విధులకు సక్రమంగా హాజరయ్యేలా చూడాలని మండల రైతులు కోరు తున్నారు. ఈ విషయమై ఏడిఎ అమ్రేష్‌కుమార్‌కు వివరణ కోరగా 2 రోజులుగా ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలు ఉండడం వల్ల అధికా రులు విధులకు ఆలస్యంగా హాజరయ్యారని తెలిపారు.

Comments

comments