Home మెదక్ వ్యవసాయ శాఖ పనితీరు భేష్

వ్యవసాయ శాఖ పనితీరు భేష్

Agricultural Operations is Good

రాష్ట్రంలో 2499 ఏఈవోల ద్వారా ట్యాబ్‌ల సహాయంతో గ్రామాలలో రైతుబంధు పథకంలో చెక్కుల పంపిణీ, రైతుల గ్రూప్ ఇన్సూరెన్స్ వివరాల సేకరణ విజయవంతంగా అమలు చేస్తున్నందుకు వ్యవసాయ శాఖను అభినందిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ డాష్‌బోర్డు, మున్సిపాలిటీలలో కార్పోరేషన్లు చేపడుతున్న అభివృద్ధి పనులు, ఓడిఎఫ్ తదీతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖాధికారులతో సిఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేత్రస్థాయిలో వివిధ శాఖల సిబ్బంది వద్ద అందుబాటులో ఉన్న ట్యాబులు, ఐపాడ్స్, సాఫ్ట్‌వేర్ సమస్యలపై బేసిక్ సర్వేను నిర్వహించాలని కలెక్టర్లను కోరారు. గ్రామాలలో వ్యవసాయ, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, బిసీ వెల్ఫేర్, రెవెన్యూ తదీతర శాఖల ద్వారా వివిధ అంశాలకు సంబంధించి సమాచారం సేకరిస్తున్న పద్దతులపై సమీక్షించారు. రైతుబంధు పథకాన్ని వ్యవసాయశాఖ ద్వారా ఏఈవోలు ట్యాబుల సహాయంతో పర్యవేక్షిస్తున్నదని తెలుపుతూ కెసిఆర్ కిట్లు, ఎంఎంఆర్/ఐఎంఆర్ పర్యవేక్షణ, ఆరోగ్యలక్ష్మి, స్కాలర్‌షీప్‌ల పంపిణీ, షాదీముభారక్, కళ్యాణలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు, వారి ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి సేకరించే సమాచారం కలెక్టర్లు పర్యవేక్షించడంతో పాటు సంబంధిత కార్యదర్శులు సమీక్షించే లా డ్యాష్ బోర్డు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు.

ఈ విషయంపై కెపిఎం జి, సిజిజిలతో పాటు వివిధ కార్యదర్శుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నివేదిక రూపోందించాలని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ నవీన్‌మిట్టల్‌ను ఆదేశించారు. ప్రస్తుతం వివిధ శాఖల్లో డేటా సేకరణకు అవలంభిస్తున్న పద్దతులను సమీక్షించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సాంకేతికత సహాయంతో సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షించుకునే అవకాశం ఉండాలన్నారు. ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఫర్ ఫార్మెన్స్ ఇండికేటర్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ… టియుఎఫ్‌ఐడిసి ద్వారా వివిధ మున్సిపాలిటీలలో చేపట్టే పనులను గుర్తించి డిపిఆర్‌లు తయారు చేయడంతో పాటు అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ శాంక్షన్లు తీసుకొని టెండర్లు పిలిచేలా చూసి కలెక్టర్లు ప్రత్యేకంగా సమీక్షించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 395 పనులను గుర్తించామని ఇవన్ని వివిధ దశలలో ఉన్నాయని అన్నారు.

తమ పట్టణాలకు వచ్చే ఎంట్రీపాయింట్స్ వద్ద ఆర్చీలు, ట్రాఫిక్ జంక్షన్ల బ్యూటిఫికేషన్, బస్ బేలు, ఎన్‌టిపిలు, గ్రేవ్ యార్డులు, డంప్ యార్డులు, స్లాటర్ హౌజెస్ తదీతర పనులు చేపట్టాలన్నారు. ఇందుకు అవసరమైన ఆర్కిటెక్చర్లను నియమించుకొని డిజైన్లు రూపోందించాలని మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. డంప్ యార్డుల నిర్మాణం కోసం ప్రభుత్వ భూములను సేకరించాలని కోరుతూ జిహెచ్‌యంసికి సంబంధించి డంప్ యార్డుల నిర్మాణం కోసం రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, యాదాద్రి తదీతర జిల్లాల్లో భూములను గుర్తించినవాటి వివరాలు సంబంధిత కలెక్టర్లకు పంపించామని, ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ముఖ్యకార్యదర్శి కలెక్టర్లను కోరారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ మాట్లాడుతూ… టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుందని, 86 శాతం కవరేజ్ సాధించారని, అక్టోబర్ 2 నాటికి రాష్ట్రమంతా ఓడిఎఫ్ లక్షసాధన దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే 12 జిల్లాలు ఓడిఎఫ్ సాధించాయని, వచ్చే మూడు నెలల్లో మిగతా 18 జిల్లాలు ఇదేస్పూర్తితో పనులు కొనసాగించి ఓడిఎఫ్‌ను సాధించాలని కలెక్టర్లను కోరారు.

టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం త్వరలోనే నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. టాయిలెట్ల నిర్మాణంలో వెనుకబడ్డ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి ఆరోగ్యశ్రీ సీఈవో మాణిక్కరాజ్ కణ్ణన్, ముఖ్యకార్యదర్శులు శాలినిమిశ్రా, పార్థసారథి, కార్యదర్శులు నవీన్‌మిట్టల్, జగదీశ్వర్, బుద్దప్రకాశ్ జ్యోతి, మెట్రోవాటర్ వర్క్ ఎండీ దానకిశోర్, పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ నీతూప్రసాద్‌లు, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, డిఆర్‌డివో వెంకట్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వరరావు, డిడబ్లువో జ్యోతిపద్మ, డిపివో హనోక్, సిపివో నాగేశ్వర్‌రావు, డిసిడబ్లువో సుధాకర్, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, పిఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, డివిహెచ్‌వో అశోక్, ఎస్పీ కార్పోరేషన్ ఈడి దేవయ్య, డిఎండబ్లువో శంకర్, సంగారెడ్డి జిల్లా నుంచి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీధర్, ఆయా శాఖల జిల్లా అధికారులు,మున్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.