Home రాష్ట్ర వార్తలు జోరందుకున్న వ్యవసాయం

జోరందుకున్న వ్యవసాయం

 సాధారణం కన్నా 16 శాతం అధికంగా వర్షపాతం నమోదు   ఉత్తర తెలంగాణలో 18, దక్షిణ తెలంగాణలో 10 శాతం నమోదు 

farmerమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రుతు పవనాల ప్రభావం మూలంగా సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో ప్రధా నమైన వరి సాగుకోసం కొన్ని ప్రాంతాల్లో ఇంకా నారుమడులు సిద్ధం చేస్తుండగా, మరి కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగు తున్నట్లు వ్యవసాయ శాఖ తన వారాంతపు నివే దికలో పేర్కొంది. వర్షాధార పంటలైన జొన్న, మొక్కజొన్న, రాగి, వేరుశనగ, నూగు, పప్పుధా న్యాలు, సోయాబీన్, పత్తి పంటలు వచ్చే వారాంతానికి ఇంకా ముమ్మరం కానున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు కావలసిన వివిధ రాకాల పంటల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచిన ట్లు తెలిపింది. అధిక ఉత్పత్తికి వీలుగా, ఖర్చు తగ్గించుకునే మార్గాలపై రైతులను చైతన్యపరిచే కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు.మొత్తం మీద రాష్ట్రంలో కంది, మొక్కజొన్న, పత్తి పంట లు మొక్క దశలో ఉన్నాయని,వరి నారుమడుల స్థాయి నుంచి నాటుకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మడ్గుల్ , తాళ్ళకొండ పల్లి మండలాల్లో జోన్న, మొక్క జొన్న పంటలపై కొద్దిపాటి తేమ ప్రభావం ఉం దని, అయితే ఎక్కడా నారుకు గాని, మొక్క దశలో ఉన్న ఇతర పంటలకు గాని రోగాలు ఆశిం చలేదని తెలిపారు.కాగా జూన్ ఒకటవ తేదీ నుంచి జులై 20 వరకు రాష్ట్రంలో 310.3 మిల్లీమీ టర్ల వర్షపా తం నమోదయి ందని ఇది సాధార ణంకన్నా 16 శాతం అధికంగా ఉందని తెలి పారు. ఇక ఉత్తర తెలంగాణలోసాధారణ వర్ష పాతం 18 శాతం నమోదుకాగా, దక్షిణ తెలం గాణలో సాధారణ వర్షపాతం 10 శాతంగా నమోదయింది. ఇక ఆల్మట్టి రిజర్వాయర్‌లో మొత్తం నీటి నిల్వ సామర్ధం 1705.00 ఫీట్లు కాగా ఇప్పటి వరకు నిల్వ సామర్ధం 1703.74 కు చేరు కుందని దీనిప్రకారం ప్రస్తుతం 122.80 టిఎంసిల నీరు చేరిందని తెలిపారు. కాగా రిజర్వాయర్‌కు 45873 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో బయటికి వదులు తున్నారు. నారా యణపూర్ రిజర్వాయర్ లో మొత్త నీటి నిల్వ సామర్ధం 1615.00 ఫీట్లు కాగా ప్రస్తుతం 1613.55 ఫీట్లకు చేరు కుందని గత సంవత్సరం జులై మాసంలో 23.81 టిఎంసిలు మాత్రమే ఉండగా ప్రస్తుతం 35.96 టిఎంసి లకు చేరుకుందని, 57022 క్యూసెక్కుల నీరు పైనుంచి వచ్చి చేరుతుండగా 48098 క్యూసె క్కుల నీటిని బయటికి వదు లుతున్నట్లు తెలి పారు. జూరాలలో 3.58 టిఎం సిల నీరు ఉండగా 59 క్యూసెక్కుల నీరు బయటి నుంచి వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో బయటికి వదులుతున్నారు.శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 ఫీట్లు కాగా గత సంవ త్సరం ఇదే రోజుకు 802.50 ఫీట్లు ఉండగా ఈ సంవత్సరం 788.40 ఫీట్ల నీరు ఉంది.
దారుణంగానే భూగర్భ నీటిమట్టం
రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి గత వారం కంటే కొన్ని జిల్లాల్లో లేశ మాత్రంగా పుంజు కోగా మరి కొన్ని జిల్లాల్లో పరిస్థితి దారుణంగానే ఉన్న ట్లు భూగర్భ జలవనరుల శాఖ తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే రెండు నుంచిమూ డు మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది.