Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

బైక్ తో భలే వ్యవసాయం

Agriculture with Bike in Yadadri Bhongir

మనతెలంగాణ/మోత్కూరు: పశువుల సహాయంతో మెట్ట, పంటచేనులో గుంటుకలు దున్నకం సాగించే పద్దతులు మాని ఓయువరైతు బైక్‌తో పత్తిచేలో గుంటుక తోలి వినూత్న ఆలోచనకు శ్రీకారం చూట్టాడు. కాదేది వ్యవసాయానికి అనర్హం అన్నచందంగా యువరైతు తన బైక్ సహాయంతో తను సాగుచేసిన పత్తిచేనులో గుం టుక,దంతెతోలు కలుపు నివారించి అందరిని ఔరా.. అనిపించాడు. యాదాద్రిభువనగిరి జిల్లా  మోత్కూరు మండలంలోని బుజిలాపురం గ్రా మానికి చె ందిన నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన గిరగాని శంభయ్యగౌడ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తానే కుటుంబానికి పెద్దదిక్కై ఓపక్క వ్యవసాయం చేస్తూ కులవృత్తి అయిన కల్లుగీయడాన్ని వదలకుండా కొనసాగిస్తున్నాడు. తండ్రి లేడనే బాధ పడకుండా తన కుటుంబాన్ని అందరిలా సంతోషపెడుతున్నాడు.

వ్యవసాయంలో రోజురోజుకు అదునాతన పరికరాలు వస్తున్న క్రమంలో అరకపశువుల కొనుగోలు భారం కావడంతో తన వద్ద ఉన్న బైక్‌తో మెట్ట పంట చేనులో గుంటుక, దంతె తోలలేమా అనే ఆలోచనతో పత్తిచేనులో బైక్‌సహాయంతో గుంటుక తోలి తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. తనబైక్ వెనుక భాగం లో గుంటుక, దంతెలను ఏది అవసరమైనప్పుడు దానిని అమర్చి తాను బైక్‌తోలుతుండగా మ రో వ్యక్తి గుంటుక, దంతెలను పట్టుకొని సాల్లలో నడుస్తాడు. ఒక ఎక రం పత్తిచేనులో కలుపు నివారణకు కూలీలకు రూ. 1000 నుండి 1500 వరకు ఖర్చు అవుతుందని అరక పశువుల సహాయంతో ఎకరం పత్తిచేనులో గుంటుక తోలితే రూ. 600 నుంచి 800 వరకు ఖర్చు అవుతున్న నేపద్యంలో బైక్‌లో ఒక లీటర్ పెట్రోల్‌తో ఎకరం పత్తిచేనులో గుంటుక తోలాడు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం అందరు రైతులకు అందేలా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Comments

comments