Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అగస్టా కేసులో సోనియా గాంధీకి ఊరట

sonia-gandhiన్యూఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో సోనియాగాంధీ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ సిబిఐకి తాము ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు స్పష్టం చేసింది. ఈ కుంభకోణంపై సిబిఐ ఇప్పటికే దర్యాప్తు జరుపు తున్నందున ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం కూడా దర్యాప్తు సంస్థ పరిధిలోనే ఉంటుందని తెలిపింది. యుపిఎ సర్కా ర్ హయాంలో అగస్టా వెస్ట్‌ల్యాండ్ చాపర్స్‌కు సంబంధించి రూ.3,600 కోట్ల కుంభకోణం చోటుచేసుకోవడం సంచలనం రేపింది. ఈ కుంభకోణానికి సంబంధించి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అహ్మద్ పటేల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ ఎంఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే పిటిషనర్ పేర్కొన్న వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సిబిఐకి సూచించడానికి కోర్టు నిరాకరించింది. మరోవైపు అగస్టా కుంభకోణానికి సంబంధించి ఈ ఏడాదిలోనే ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Comments

comments