Home జాతీయ వార్తలు ఉత్కంఠ పోరులో అహ్మద్ పటేల్ విజయం

ఉత్కంఠ పోరులో అహ్మద్ పటేల్ విజయం

                        BJP-Leaders

న్యూఢిల్లీ : ఉత్కంఠభరితంగా సాగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎట్టకేలకు విజయం సాధించారు. ఆయన గెలుపుతో కాంగ్రెస్ వర్గాలు సంబరాలు చేసుకుంటు న్నాయి. ఈ ఏడాది ఆఖర్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన విజయం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపినట్లయింది. నిబంధనలను ఉల్లంఘించారంటూ ఇద్దరు కాంగ్రెస్ అసమ్మతి ఎంఎల్‌ఎల ఓట్లను చెల్లనివిగా ఎన్నికల సంఘం (ఇసి) ప్రకటిం చడంతో ఆయన గెలుపుకు అవసరమైన ఓట్ల సంఖ్య 45 నుండి 44కి తగ్గింది. దీంతో 44 ఓట్లు దక్కించుకోవడం ద్వారా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శి అయిన పటేల్ తన ప్రత్యర్థి బల్వంత్‌సిన్హ రాజ్‌పుత్‌పై విజయం సాధించారు. రాజ్‌పుత్‌కు 38 ఓట్లు వచ్చాయి.

గెలుపు అనంతరం అహ్మద్ మాట్లాడుతూ.. ‘ఇది నా విజయం మాత్రమే కాదు. ఇది విపరీతమైన అంగబలం, అర్థబలం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ దుర్వినియోగం మూటగట్టుకున్న పరాజయం కూడా’ అని ఆయన వ్యాఖ్యానించారు. తాజా గెలుపుతో ఆయన ఐదోసారి పెద్దల సభలో అడుగుపెడుతున్నారు. ఇలాంటి క్లిష్టమైన ఎన్నికల్లో తనకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. బిజెపి తరపున పోటీ చేసిన ఆ పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తేలికగానే తమ తమ ప్రత్యర్థులపై గెలుపొందారు. వారికి ఒక్కోక్కరికి 46 ఓట్ల చొప్పున వచ్చాయని ఇసి అధికారి ఒకరు తెలిపారు. వారిద్దరికీ ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. తమ పార్టీకి మద్దతిచ్చిన ఇద్దరు కాంగ్రెస్ అసమ్మతి ఎంఎల్‌ఎల ఓట్లు చెల్లవంటూ తీసుకున్న నిర్ణయాన్ని తాము న్యాయబద్ధంగా సవాలు చేస్తామని గుజరాత్ సిఎం విజయ్ రుపానీ ఈ సందర్భంగా వెల్లడించారు.

అహ్మద్ పటేల్‌కు శరద్ యాదవ్ అభినందన

రాజ్యసభ ఎన్నికలలో గుజరాత్ నుంచి విజయం సాధించినందుకు అహ్మద్ పటేల్‌కు జెడియూ సీనియర్ నేత శరద్ యాదవ్ అభినందనలు తెలిపారు. పలు కటుతర అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించినందుకు సంతో షంగా ఉందని, రాజకీయ జీవితంలో ఆయన మరిన్ని విజయాలు సాధించా లని ఆశిస్తున్నట్లు యాదవ్ స్పందించారు.

ఉత్కంఠ కల్గించిన ఎన్నికలలో పటేల్ గెలుపును అభినందిస్తూ శరద్ యాదవ్ వ్యాఖ్యానించడం కీలకంగా మారింది. అహ్మద్ పటేల్‌తో తాను కలిసి దిగి ఉన్న ఫోటోను కూడా శరద్ యాదవ్ తమ బ్లాగ్‌లో ఉంచారు. తనకు అభినందనలు తెలిపిన శరద్‌యా దవ్‌కు పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.గుజరాత్‌లో ఏకైక జెడియూ ఎమ్మెల్యే నుంచి కూడా తనకు మద్దతు దక్కినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.