Search
Saturday 17 November 2018
  • :
  • :

మోడీపై మండిపడిన రాహుల్

Rahul Gandhi : Comments on PM Narendra Modiఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీపై జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ నేతృత్వంలో దేశం క్రూరంగా తయారవుతోందని ధ్వజమెత్తారు. మానవత్వం తగ్గి ద్వేషం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఓ ముస్లిం యువకుడిని గోసంరక్షణ కార్యకర్తలు కొట్టి చంపిన ఘటనపై రాహుల్ స్పందించారు. మూకోన్మాదుల దాడిలో గాయపడిన అక్బర్ ఖాన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లడంలో పోలీసులు నిర్లక్షం వహించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. మోడీ హయాంలో రోజురోజుకు హింస పెరుగుతుందని విమర్శించారు. నాలుగేళ్ల మోడీ పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన చెప్పారు.

AICC President Rahul Gandhi Comments on PM Narendra Modi

Comments

comments