Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

గుజరాత్‌లో విజయం మాదే : రాహుల్

RG

అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ కొత్త అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన జగన్నాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గుజరాత్‌లో తొలి విడుత ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తప్పక గెలుస్తుందన్న నమ్మకం తమకు ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. తాను ఆలయాలను సందర్శించడంపై బిజెపి చేస్తున్న ఆరోపణలను ఆయన గట్టిగా ఖండించారు. ఆలయాలకు వెళ్లే హక్కు తనకు ఉందని ఆయన చప్పారు. గుజరాత్ ప్రజల సంక్షేమం, వారి భవిష్యత్ కోసమే తాను ఆలయాలకు వెళుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. గుజరాత్‌లో బిజెపిని ఓడించేందుకు పాక్‌తో కాంగ్రెస్ కుమ్మక్కైందంటూ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఉద్ధేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ తప్పుబట్టారు. మన్మోహన్‌పై మోడీ అలా వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. మన్మోహన్ గురించి మోడీ ఇలా వ్యాఖ్యానించడాన్ని తాము ఎంతమాత్రం అంగీకరించబోమని ఆయన చెప్పారు.

AICC President Rahul Gandhi Comments on PM Narendra Modi

Comments

comments