Home రాష్ట్ర వార్తలు రాహుల్ ప్రజాగర్జన సభకు ఘనంగా ఏర్పాట్లు

రాహుల్ ప్రజాగర్జన సభకు ఘనంగా ఏర్పాట్లు

                    Congress-Meeting

సంగారెడ్డి ప్రతినిధి: రాష్ట్ర కాంగ్రెస్ నా యకత్వం గురువారం నాడు సంగారెడ్డిలో ఘనంగా జర పతలపెట్టిన ‘ప్రజాగర్జన’ మహాసభకు పెద్ద ఎత్తున ఏర్పా ట్లు చేశారు. ఈ సభకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాం ధీ విచ్చేస్తున్నారు. ఆయన సాయంత్రం 5.40 గంటలకు సంగారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకొని వివిధ వర్గాలతో భేటీ అవుతారు. 6.45కు అంబేడ్కర్ స్టేడియ ంలో జరగనున్న గర్జన సభకు హాజరై 8 గంటల వరకు ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే సమర శంఖం పూరిస్తారని ఆ పార్టీ ప్రకటించింది. ఈ సభకు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను రాష్ట్ర స్థాయి నేతలు పర్యవేక్షించారు. మాజీ విప్ తూర్పు జయప్రకాష్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రాహుల్ గాంధీ సంగారెడ్డి జిల్లా కేంద్రానికి రావడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్‌కు సెంటిమెంట్ మైదానంగా చెప్పుకుంటున్న అంబేడ్కర్ స్టేడి యంను పార్టీ నేతల భారీ కటౌట్లు, పార్టీ జెండాలతో అలంకరించారు. నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకల కటౌట్లు ఒకేచోట ఏర్పాటు చేశారు.

మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నేతల కటౌట్ల నూ పెట్టారు. దాదాపు రెండు లక్షల మంది సభకు వస్తారని భావిస్తూ, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. అగ్రనేతలు వారం రోజులుగా అంబేడ్కర్ స్టేడి యం గ్రౌండ్‌ను సందర్శిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నా రు. బుధవారం కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడు షబ్బీ ర్ అలీ పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇనన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా సాయంత్రం సంగారెడ్డికి చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. పటాన్‌చెరు మండలం ము త్తంగి వద్ద జిల్లాలోకి ప్రవేశించే రాహుల్ గాంధీని అక్కడి నుంచి సంగారెడ్డి వరకు భారీ కాన్వాయ్‌తో తీసుకురా వాలని నిర్ణయిం చారు. దాదాపు 150 వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతించారు. రాహుల్ గాంధీ సంగారెడ్డికి చేరుకున్న తర్వాత అంబేడ్కర్ స్టేడియం పక్కనే ఉన్న దీన్ దార్ ఫంక్షన్ హాల్‌లో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఆ తర్వాత రైతలు, విద్యార్థులు, నిరుద్యోగులతో భేటీ అవుతారు. రాత్రి 6.30 గంటల ప్రాంతంలో సభా ప్రాంగణానికి చేరుకొని ప్రజ లనుద్దేశి ంచి ప్రసంగిస్తారు.

రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూలు

తెలంగాణ ప్రజా గర్జన సభలో పాల్గొనే నిమిత్తం వస్తున్న ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గురువార రాష్ట్రంలో దాదాపు ఏడు గంటల పాటు గడపనున్నారు. షెడ్యూల్ ఇలా వుంది… 3.30 కు బేగంపేట విమానాశ్రయానికి రాక, ముఖ్య నాయకుల స్వాగతం, 4.00 సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నివాళులు, 4.25-4.30 కు ఎర్రగడ్డ వద్ద జూబ్లీహిల్స్ కార్యకర్తల స్వాగత సత్కారాలు, 4.45-4.50 వరకు కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆగుతారు, 5.00-5.05 వరకు మియాపూర్ వద్ద కార్యకర్తల అభివాదం, 5.20-5.25 పటాన్ చెరులో స్వాగత కార్యక్రమాలు, 5.40 కు సంగారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరిక, 5.40-6.30 వరకు అతిథి గృహంలో వివిధ వర్గాలతో భేటీ, 6.45-8.00 వరకు కు అంబేద్కర్ స్టేడియంలో గర్జన సభలో పాల్గొంటారు, 9.00 కు బేగంపేట నుంచి తిరుగు ప్రయాణం