Home తాజా వార్తలు జయలలిత మృతిపై ఎయిమ్స్ నివేదిక

జయలలిత మృతిపై ఎయిమ్స్ నివేదిక

Jayalalithaa-Smile

తమిళనాడు దివంగత సిఎం జయలలిత మృతిపై ఎయిమ్స్ సోమవారం తన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. జయలలిత చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం కూడా ట్రీట్‌మెంట్ ఇచ్చింది. వారు జయకు చేసిన వైద్యానికి సంబంధించిన రికార్డులను తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి జె. రాధాకృష్ణన్‌కు సమర్పించారు. జయలలిత మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని మాజీ సిఎం పన్నీర్ సెల్వం న్యాయ విచారణకు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పన్నీర్ సెల్వం చేస్తున్న ఆరోపణలను తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఖండించారు.