Home జాతీయ వార్తలు నెలరోజుల్లో మోడీ మాజీ కావడం ఖాయం: ఒవైసీ

నెలరోజుల్లో మోడీ మాజీ కావడం ఖాయం: ఒవైసీ

Asaduddin and Modiఔరంగాబాద్‌: నెలరోజుల్లో ప్రధాని మోడీ మాజీ కావడం ఖాయమని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసియ జోస్యం చెప్పారు. ప్రధాని మాటలకు, చేతలకు సంబందం లేదని అసదుద్దీన్‌ విమర్శించారు. ఓ వైపు ఉగ్రవాద నిరోధం, దేశభద్రతపై మాట్లాడే ఆయన, మరోవైపు ఉగ్రదాడుల్లో నిందితులైన వారికి పార్టీ టికెట్లు ఇచ్చి నిలబెడతారని ఆరోపణలు గుప్పించారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఒవైసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఎప్పటిలాగే నిప్పులు కురిపించాడు. ఉగ్రవాదం నిరోధం గురించి స్పీచ్ లు ఇస్తున్న మోడీ మాలేగావ్‌ పేలుళ్ల ఘటనలో 6 గురు ప్రాణాలను బలిగొన్న కేసులో నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ కు బిజెపి టికెట్టు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదంపై పోరాడుతున్నట్టు చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మోడీ కల్లబొల్లి మాటలు దేశ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు.
AIMIM Chief Asaduddin Owaisi Attacks PM Modi