Search
Wednesday 14 November 2018
  • :
  • :

పెళ్లి వేడుకపై వైమానిక దాడి : 20 మంది మృతి

Air Attack on Wedding Ceremony : 20 People died

యెమెన్ : బాని ఖాయిస్ జిల్లాలో పెళ్లి వేడుకపై సౌదీ సంయుక్త దళాలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడిలో 20 మంది చనిపోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో పెళ్లి కుమార్తెతో పాటు మహిళలు, చిన్నారులు ఉన్నారు. వరుడితో సహా 40 మంది గాయపడినట్టు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న జోమ్‌హౌరి ఆస్పత్రికలో చేర్పించారు. యెమెన్‌లోని షియా రెబల్స్ ఉన్న ప్రాంతాలపై సౌదీ సంయుక్త దళాలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.

Air Attack on Wedding Ceremony : 20 People died

Comments

comments