Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

నింగిలో ఊగిపోయిన ఎయిర్ ఇండియా విమానం…

Air-inadia-flight

డిల్లీ: గాలిలో ప్రాణాలు గాలిలో కలిసిపోవడం అంటే  ఏమిటో ప్రయాణికులకు ప్రత్యక్ష్యంగా రుచి చూపించింది ఎయిర్ ఇండియా విమానం. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం అమృత్ సర్ నుంచి డిల్లీకి పయనం అయ్యింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానానికి ఉన్న ఓ కిటికీ ఊడింది. దీంతో విమానం లో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. కిటికీ ఊడిన సందర్భంలో గాలి తాకిడికి విమానం కొద్దిసేపు ఊగిపోయింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. మరి కొందరయితే మృత్యువు గడియాలు సమీపించాయని ఏడవడం కూడా జరిగింది. దీంతో విమానంలో దాదాపు 15 నిమిషాల పాటు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఎయిర్ హోస్టెస్ సిబ్బంది ఈ కిటికీని యథాస్థానంలో బిగించడంతో విమానంలో ప్రయాణించే 240 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో తెగ హల్ చల్ చేస్తుంది.

Comments

comments