Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

5జి సేవల కోసం నోకియాతో ఎయిర్‌టెల్, బిఎస్‌ఎన్‌ఎల్ జట్టు

5G

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికే 4జి సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా టెలికామ్ దిగ్గజం ఎయిర్‌టెల్, ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌లు 5జి సేవలపై దృష్టిపెట్టాయి. ఈ రెండు సంస్థలు దేశంలో 5జిని ప్రవేశపెట్టేందుకు గాను నోకియాతో ఒప్పందం కుదుర్చు కున్నాయి. ముంబయి, గుజరాత్, పశ్చిమబెంగాల్, కేరళ లోని తొమ్మిది సర్కిళ్లలో నోకియా ప్రస్తుతం ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు 4జి ఎక్విప్‌మెంట్‌ను పంపిణీ చేస్తోంది. అయితే ఈ సంస్థల ఒప్పందం ఉద్దేశం 5జిని ప్రవేశపె ట్టడమే, ఈ దిశగా పనులు చేపట్టామని నోకియా ఇండియా మార్కెట్ హెడ్ సంజయ్ మాలిక్ తెలిపారు. 5జి ఇంటర్నెట్ కోసం దిగ్గజ సంస్థలు నోకియాలు చేతులు కలుపుతున్నాయి.

భారత్‌లో వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించేందుకు ఈ మూడు సంస్థలు కలిపి పనిచేయను న్నాయి. ఇతర నెట్‌వర్క్‌ల భాగస్వామ్యంతో దేశంలో 5జి సేవలను ప్రారంభించడమే తమ లక్ష్యమని ఈ ఏడాది మార్చిలో నోకియా స్పష్టం చేసింది. ఇందుకు సంబం ధించి ఈ మూడు కంపెనీలు అవగాహన ఒప్పందంపై సంతకాలు కూడా చేసినట్లు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. దీంతో దేశంలో అత్యధిక వేగంతో వైర్‌లెస్ బ్రాడ్‌బాండ్ సేవలు రానున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ సిటీలకు ఇది మరింత ఉపయోగకరంగా మారనుంది. 5జి ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి బిఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి పనిచేయడమే లక్ష్యమని నోకియా వెల్లడించింది. ఈ మేరకు ఇరు కంపెనీలు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. అంతేకాకుండా 5జీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాయి. వీటితో పాటు హెల్త్‌కేర్, వర్చువల్ రియాల్టీ, కార్ల అనుసంధానం, గృహ, వ్యాపారాల్లో పూర్తి యాంత్రీకరణ తదితర విషయాలపై దృష్టి సారించనుంది.

Comments

comments