Home అంతర్జాతీయ వార్తలు నేపాల్‌లో కుప్పకూలిన విమానం

నేపాల్‌లో కుప్పకూలిన విమానం

23మంది మృతి
విమాన శకలాలను కనుగొన్నాం : నేపాల్ మంత్రి పోఖరేల్
aeroplane1ఖాట్మండూ: నేపాల్‌లో ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలింది. బుధవారం సం భవించిన ఈ ప్రమాద ఘటనలో 23మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు విదేశీయు లు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎన్‌హెచ్-ఎహెచ్‌హెచ్ విమానం విమానాశ్రం నుంచి ఉదయం 7-45గంటలకు నేపాల్‌లోని పొ ఖారా నుంచి జామ్‌సమ్‌కు బయల్దేరిందని, దట్టమైన పర్వత ప్రాంతాల (మౌంట్ అన్న పూర్ణ) గుండా విమానం ప్రయాణిస్తున్న సమయంలో మార్గంలో స్పష్టత లోపించి ప్రమాదం సంభవించిందని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. ప్రజలు పర్వత ప్రాంతాలను అధిరోహించేదుకు ఇదే ప్రారంభ స్థలమని చెప్పారు. ఖాట్మండూకి 220 కి.మీ.దూరంలో ఉన్న పశ్చిమ జిల్లా మ్యాగ్డీలోని సోలిఘోప్తే ప్రాంతంలో విమా న శకలాలను కనుగొన్నామని నేపాల్ పౌర విమానయాన, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆనంద పోఖరేల్ తెలిపారు. విమానంలో ముగ్గురు సిబ్బంది సహా ఇద్ద రు చిన్నారులు, మరో ఇద్దరు విదేశీ ప్రయా ణికులు, నేపాల్ దేశానికి చెందిన 18 మంది పౌరులతో కలిపి మొత్తం 25మంది ఉన్నారని వివరించారు. అయితే మరణిం చిన విదేశీయులలో ఒకరు చైనాకు చెందిన వాడా లేదా కువైట్ జాతీయుడా అనే విష యం ఇంకా నిర్థారణ కాలేదన్నారు. విమా నం కుప్పకూలిన వెంటనే మంటల్లో దగ్ధమై నట్టు ఆనవాళ్లు ఉన్నాయని సంఘటనా స్థలిని సందర్శించిన సహాయక బృందం తెలిపిందన్నారు. నేపాల్ పౌర విమాన యాన అధికారయంత్రాంగం, అధికారులు మాట్లాడుతూ విమాన ప్రమాదానికి గల కారణాలేమిటన్నవి ఇంకా తెలియరాలేద ని, దర్యాప్తు కొనసాగుతున్నదని వివరిం చారు. స్థానికులు మాట్లాడుతూ మారు మూల ప్రాంతంలో పెద్దయెత్తున మంటలు చెలరేగడం కనిపించిందని చెప్పారు. ఆ ప్రాంతంలో మబ్బులు కమ్ముకుని మార్గం స్పష్టంగా కనిపించకపోవడం మూలంగా ప్రమాదం జరిగిఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మౌంట్ అన్నపూర్ణ పర్వత శిఖరాలలో ఉన్న కొండచరియలకు తాకి విమానం కుప్పకూలి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ‘ప్ర మాద సంఘటనాస్థలికి మూడు హెలికా ప్టర్లను పంపించాం. అక్కడ గాలింపు, సహాయక పనులు కొనసాగుతున్నాయని ఎయిర్‌లైన్స్ తన వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. హిమాలయ పర్వతాలకు నిలయమైన నేపాల్‌లో రోడ్డు మా ర్గాల నెట్‌వర్క్ పరి మితంగా ఉంది. అందు వల్ల నేపాల్ లో ప్రయాణికులు కాలినడక లేదా విమానమార్గాన్ని ఎంచుకుంటారు.