Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

రెండు వేలకే ఎయిర్‌టెల్ 4జి ఫోన్!

Airtel-4gన్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఫోన్ పోటీగా ఇతర టెలికామ్ సంస్థలు కూడా ఫోన్‌ను తీసుకొచ్చే పనిని వేగవంతం చేశాయి. ఇప్పటికే తక్కువ ధరకే 4జి ఫోన్‌ను తీసుకొస్తామని ప్రకటించిన ఎయిర్‌టెల్ ముందుగా ప్రకటించిన రూ.2500 కంటె తక్కువ రేటుకే ఫోన్‌ను తీసుకురావాలనుకుంటోంది. అక్టోబర్ మొదటి వారంలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించే అవకాశముందని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్ ధర రూ.2500 వరకు ఉంటుందని కంపెనీ ముందే ప్రకటించినప్పటికీ రూ.2 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఒఎస్‌తో ఇది పనిచేస్తుందని తెలుస్తోంది. జియోకి పోటీగా తీసుకొస్తున్న ఈ ఫోన్ వాయిస్, డేటా సర్వీసులను కూడా ఇందులో పొందుపరిచిందని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి అన్నిరకాల యాప్‌లను డౌన్ చేసుకునేలా ఈ ఫోన్ ఉంటుందని సమాచారం. డ్యుయల్ సిమ్, 4 అంగుళాల డిస్‌ప్లే, 1జిబి ర్యామ్, డబుల్ కెమెరాలు, 4జి వోల్ట్ కాలింగ్ సదుపాయం, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయని అంటున్నారు. ఈ వార్తలను ఎయిర్‌టెల్ మాత్రం అధికారింగా ప్రకటించలేదు.

Comments

comments