Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

విజయ్ దేవరకొండ అంటే ఇష్టం

అసలు పేరు : షషా చెత్రి
ముద్దు పేరు : రిక్షా రాణి
వృత్తి : మోడల్, మ్యుజీషియన్, నటి
పుట్టిన తేది: 26 నవంబర్ 1996
పుట్టిన ఊరు : డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
చదువు : అడ్వర్‌టైజింగ్‌లో డిగ్రీ
పేరు తెచ్చిన యాడ్స్:ఎయిర్‌టెల్
4జీ యాడ్
అభిరుచులు : పాటలు పాడటం,
గిటార్ వాయించడం
ఇష్టమైన ఆహారం : పానీపూరి

Vijaya-Devara-Konda

ఏ టీవి ఛానల్‌లో చూసినా ఎయిర్‌టెల్ యాడ్ తెగచూపిస్తుంటారు. హీరోయిన్స్‌కి కూడా లేని ఫాలోయింగ్ ఈ అమ్మాయికి ఉంది. సోషల్‌మీడియాలో కూడా ఎప్పుడూ ఉంటూ అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటోంది. ఎయిర్‌టెల్ 4జీ అనగానే మన కళ్ల ముందు ఓ అమ్మాయి ప్రత్యక్షం అవుతుంది కదా! ఇప్పుడు ఆ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా అవకాశం చేజిక్కించుకుంది. అది కూడా ఓ తెలుగు సినిమాలోనే కావడం విశేషం. అవును.. ఎయిర్‌టెల్ అమ్మాయి, 4జీ గర్ల్ అంటూ గుర్తింపు పొందిన షషా చెత్రి త్వరలోనే ఓ తెలుగు సినిమాలో కథానాయికగా నటించనుంది. అడవి కిరణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. భాషతో సంబంధం లేకుండా తెలుగులో అడుగుపెట్టడానికి కారణం కథపై ఉన్న నమ్మకమేనని షషా అంటోంది. అంతేకాకుండా.. తన కెరియర్‌లో తొలి చిత్రం అయినా కూడాఈ సినిమా లో ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నట్లు చెప్పింది. అర్జున్‌రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ అంటే తనకు ఎంతో ఇష్టమని షషా చెబుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తనకు ఇష్టమేనట.

టాలీవుడ్‌లో చాలా మంది ప్రతిభ ఉన్న నటులున్నారని పేర్కొంది. సినిమాల వైపు రావడానికి తనకు ఎయిర్‌టెల్ యాడ్ ఎంతగానో ఉపయోగపడిందని షషా చెప్పుకొచ్చింది. ఆ ప్రకటనకు సంబంధించిన క్యాంపెయిన్ చాలా ఎక్కువ కాలం సాగిందని, ఈ కారణంగా దేశవ్యాప్తంగా తనను అందరూ గుర్తు పెట్టుకున్నారని తెలిపింది. వాణిజ్య ప్రకటనల తర్వాత తనను నటనవైపు వెళ్లమని చాలా మంది సూచించారని గుర్తుచేసుకుంటోంది.

బేషరమ్ అనే మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా తాను ఇంతకుముందెన్నడూ కనిపించని రీతిలో దర్శనమిచ్చిన షషా అభిమానులను ఇప్పటికే సర్‌ప్రైజ్ చేసింది. ఎయిర్‌టెల్ యాడ్‌లో సంప్రదాయబద్ధంగా కనిపించిన ఈ అమ్మాయి.. ఈ సాంగ్‌లో కాస్త బోల్డ్‌గా దర్శనమివ్వడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమతో తన సత్తా నిరూపించుకోవడానికి రెడీ అవుతోంది.

Comments

comments