Search
Friday 21 September 2018
  • :
  • :

రూ.1,249కే 4జి స్మార్ట్‌ఫోన్

Celkon-Star-4G-Android-smar

ముంబయి: మొబైల్ తయారీ కంపెనీ సెల్‌కాన్‌తో కలిసి టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ రూ. 1249కే కొత్త 4జి స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా మార్కెట్‌లో విడుదల చేసింది. సెల్‌కాన్ స్టార్ 4జి ప్లస్ పేరిట విడుదలైంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొదట కస్టమర్లు రూ. 2,749 చెల్లించి కొనుగోలు చేయాలి. మొబైల్‌ను 18 నెలలు వాడిన అనంతరం రూ. 500, 36 నెలలు వాడిన తరువాత రూ. 1000 మొత్తం కలిపి రూ. 1500 తిరిగి ఇస్తారు. దీంతో ఫోన్ ధర రూ. 1249 అవుతుంది. అంతేగాక ఈ మొబైల్‌లో కస్టమర్లు ప్రతినెల రూ. 169 ఆపైన విలువ గల ప్లాన్‌ను వాడాలి. అలాగైతేనే డబ్బులు తిరిగి చెల్లిస్తారట.

‘సెల్‌కాన్ స్టార్ 4జి ప్లస్’ ఫీచర్లు…
4 ఇంచ్ తాకే తెర(800 x 480 పిక్సల్స్ రిజల్యూషన్)
ర్యామ్ 512 ఎంబి
ఇంటర్నల్ స్టోరేజీ 4జిబి(32జిబిల వరకు విస్తరించుకునే సదుపాయం)
2 ఎంపి ఫ్రంట్ కెమెరా
3.2 ఎంపి బ్యాక్ కెమెరా
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
1800 ఎంఎహెచ్ బ్యాటరీ
4జి విఒఎల్‌టిఇ సపోర్ట్
బ్లూటూత్ 2.1
డ్యూయల్ సిమ్

Airtel launches Celkon Star 4G+ smartphone at an effective price of Rs 1249.

Comments

comments