Home తాజా వార్తలు కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన ఎయిర్‌టెల్

కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన ఎయిర్‌టెల్

Airtelన్యూఢిల్లీ: ఎయిర్ టెల్ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఒక్కో కస్టమర్ నుంచి లభించే సగటు ఆదాయం (ఎఆర్‌పియు) పెంచుకుకోవడానికి ఎయిర్‌టెల్‌ సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రూ.499 కంటే తక్కువ ఉండే ఆఫర్ లకు గుడ్ బై చెబుతున్నట్టు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే రూ.299 పోస్ట్‌పెయిడ్‌ పథకానికి టాటా చెప్పింది. అతిత్వరలో రూ.349, రూ.399 పోస్ట్‌పెయిడ్‌ పథకాలకు స్వస్తి చెబుతుందని టాక్. రూ.499 కంటే ఎక్కువ ఉండే పోస్ట్‌ పెయిడ్‌ ఆఫర్ లోనూ రూ.749, రూ.999, రూ.1,599లను మాత్రమే కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Airtel phase out postpaid plans below Rs 499