Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

39 శాతం క్షీణించిన ఎయిర్‌టెల్ లాభం

airtel

ముంబయి: దేశీయ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌పై జియో దెబ్బ మరోసారి తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.306 కోట్లతో 39 శాతం క్షీణించింది.  అంచనాలను కంపెనీ అందుకోలేదు. టెలికాం దిగ్గజం ఇలా పడిపోవడం వరుసగా ఇది ఏడో త్రైమాసికం కావడం విశేషం. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఇంటర్‌కనెక్ట్ ఛార్జీలను తగ్గించడం, రిలయన్స్ జియో నుంచి తీవ్ర ధరల పోటీ వంటివి ఎయిర్‌టెల్‌ను దెబ్బతీశాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.504 కోట్లుగా ఉన్న ఎయిర్‌టెల్ లాభాలు, ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.306 కోట్ల్లుగా నమోదయ్యాయి. రెగ్యులేటరీ ఇంటర్‌కనెక్ట్ ఛార్జీలను తగ్గించడం, ఇంటర్నేషనల్ టర్మినేషనల్ రేట్ల తగ్గింపు ఫలితాలపై ప్రభావం చూపా యని ఎయిర్‌టెల్ భారత్, దక్షిణాసియా ఎండి, సిఇఒ గోపాల్ విట్టల్ తెలిపారు. కంపెనీ లాభాలు రూ.455 కోట్లగా ఉంటాయని అంచనా వేయగా, అంచనాల కంటే భారీగా పతనమైంది. జూలై- సెప్టెంబర్ త్రైమాసి కంలో ఈ కంపెనీ లాభాలు రూ.343 కోట్లు, కన్సాలిడేటెడ్ రెవెన్యూ కూడా సుమారు 13 శాతం పడిపోయి రూ.20,319 కోట్లగా నమోదైంది. గతేడాది కంటే ఈ ఏడాది డేటా, వాయిస్ కాల్ రేట్లు పడిపోవడంతో, రెవెన్యూలు పడిపోయినట్టు కంపెనీ తెలిపింది.

Comments

comments