Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కొత్త ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్!

Airtel Rs 97 new plan combo recharge
ముంబయి: జియో రూ.98 ఆఫర్ కి పోటీగా ఎయిర్ టెల్ నూతన ఆఫర్ ని శుక్రవారం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎయిర్ టెల్ రూ.97 పేరిట కొత్త ఆఫర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ లో భాగంగా 350 నిమిషాల ఫ్రీ వాయిస్ కాల్స్, 200 ఎస్ఎంఎస్ లతో పాటు డైలీ 1.5జిబి 3జి, 4జి డేటాని పొందవచ్చును. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులుగా నిర్ణయించింది ఎయిర్ టెల్. రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు ఎయిర్ టెల్ వెబ్ సైట్ గాని లేదా మై ఎయిర్ టెల్ యాప్ ని గాని సందర్శించాలని సంస్థ వెల్లడించింది. అయితే, 28 రోజుల వ్యాలిడిటీ గల జియో రూ.98 ఆఫర్లో అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకి 2 జిబి డేటాతో పాటు 300ఎస్ఎంఎస్ లని వినియోగదారులు పొందవచ్చునని ఎయిర్ టెల్ ప్రకటించింది.

Comments

comments