Home తాజా వార్తలు ఎయిర్‌టెల్ ప్లాన్లతో మరింత డేటా

ఎయిర్‌టెల్ ప్లాన్లతో మరింత డేటా

Airtal-offers

ముంబయి: ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు శుభవార్త వినిపించింది. రూ.799, రూ.1199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఇస్తున్న డేటా లిమిట్‌ను తాజాగా పెంచింది. ఇదివరకు రూ.799 ప్లాన్‌లో 60జిబి, రూ.1199 ప్లాన్‌లో 100 జిబి డేటా వినియోగదారులకు అందించింది. ప్రస్తుతం రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో కస్టమర్లకు 100జిబి డేటాను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1199 ప్లాన్‌లో 120 జిబి డేటా అందిస్తోంది. ఈ ప్లాన్లలో డేటాకు గాను డేటా రోల్ ఓవర్ సౌకర్యాన్ని వినియోగదారులకు కూడా అందిస్తున్నారు. అంతే కాకుండా ఈ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు, అమెజాన్ ప్రైమ్ సంవత్సరం పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్, ఉచిత వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ టివి, ఉచిత హ్యాండ్ సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌లను ఈ ప్లాన్లతో  అందిస్తుందని ఎయిర్‌టెల్ సంస్థ వెల్లడించింది.