ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ ఐశ్వర్యారాయ్ పెళ్లయిన తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్నిచ్చింది. కొంతకాలం క్రితం సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆమె నటించిన తాజా చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’. ఈ సినిమాలో గ్లామర్, రొమాంటిక్ సీన్లలో జోరుగా నటించేసి ప్రేక్షకులను మురిపించింది ఈ బ్యూటీ. ఈ చిత్రంలో తనకన్నా చిన్నవాడైన రణబీర్‌కపూర్‌తో ఐష్ రొమాన్స్ చేసింది. యంగ్ హీరోయిన్లకు ధీటుగా రెచ్చిపోయిన తీరు ఇటీవల విడుదలైన ట్రైలర్లలో దర్శనమిచ్చింది. దీంతో ఆమె అత్తామామలైన జయ, అమితాబ్‌కు చాలా కోపం వచ్చి ఐష్‌ను మందలించారట. అప్పటినుండి వారి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయనే ప్రచారం మొదలైంది. ఇదిలాఉండగా ఐశ్యర్య తీసుకున్న ఓ నిర్ణయం మూలంగా ఇప్పుడు భర్త అభిషేక్‌తో కూడా ఆమెకు విభేదాలొచ్చేశాయని అంటున్నారు. తన మాజీ ప్రియుడైన సల్మాన్‌తో ఓ సినిమా చేయడానికి ఐశ్వర్య ఒప్పుకోవడమే ఈ గొడవలకు కారణమట. సల్మాన్‌తో సినిమాకు ఓకే అనడంతో ఐశ్వర్య కష్టాల్లో పడిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక అభిషేక్‌కు ఇష్టం లేకపోయినా సల్మాన్‌తో కలిసి ఐష్ నటిస్తుందా లేక భర్త వద్దన్నాడని సినిమాను వదులుకుంటుందా అనేది చూడాలి.