Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

‘ఉయ్యాలవాడ…’కు రూ.9 కోట్ల డిమాండ్

aishwarya

ఈమధ్య టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం కష్టమైపోతోంది. ఈ ఏడాదే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ విషయంలో ఇబ్బంది తప్పలేదు. ‘ఖైదీ నంబర్ 150’ కోసం పలువురు హీరోయిన్లను పరిశీలించి చివరికి కాజల్ అగర్వాల్‌ను కథానాయికగా తీసుకున్నారు. ఇప్పుడు చిరు 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కోసం హీరోయిన్‌ను సెట్ చేయడం కష్టంగా మారింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ తెరకెక్కబోతోంది. దీంతో అన్ని భాషల్లో పరిచయం ఉన్న… నేషనల్ అప్పీల్ ఉన్న హీరోయిన్‌ను ఎంచుకుందామని చూస్తున్నారు. ఇందుకోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ల కోసం ప్రయత్నిస్తుండగా… వాళ్లు భారీ రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తున్నారట. తాజాగా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ను ఈ సినిమా కోసం అడిగితే ఆమె ఏకంగా రూ.9 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. ఐశ్వర్య అయితే అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని… వయసుపరంగా కూడా చిరుతో బాగా సెట్ అవుతుందని అనుకున్నారు. అయితే ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో ఫిల్మ్‌మేకర్స్ ఆలోచిస్తున్నారట. మరి ఐశ్వర్య ఏమైనా పారితోషికాన్ని తగ్గించుకుంటుందా లేక వేరే ఆప్షన్ ఏదైనా చూస్తారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు అనుష్క, నయనతార వంటి సౌత్ సీనియర్ హీరోయిన్లను తీసుకునే   పరిశీలిస్తున్నారు.

Comments

comments