Home గాసిప్స్ భన్సాలీ చిత్రంలో ఐశ్వర్య?

భన్సాలీ చిత్రంలో ఐశ్వర్య?

Aishwarya-Rai-Bachchan

ముంబయి : సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న పద్మావతి చిత్రంలో ఐశ్వర్యరాయ్ నటిస్తుందని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఐశ్వర్య భన్సాలీని కలవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది.

కానీ ఐశ్వర్య పద్మావతిలో నటించే అవకాశం లేదని, భన్సాలీ తదుపరి చిత్రంలో నటించే అవకాశం ఉందని చిత్ర బృందం చెబుతోంది. పద్మావతి చిత్రంలో ప్రధాన పాత్రలో దీపికా పదుకొణె నటిస్తోంది. ఆమె భర్త రాజా రావల్త్రన్‌సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీ భార్య పాత్రలో అదితిరావ్ హైదరీ నటిస్తున్నారు.

వీరే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని, అంతేకాని మరో ఇతర స్టార్ నటులు ఇందులో నటించడం లేదని చిత్రబృందం స్పష్టం చేసింది. పద్మావతి చిత్రం తరువాత భన్సాలీ కశ్మీర్ ప్రాంతం నేపథ్యంలో ఓ ప్రేమకథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని, అందులో ఐశ్వర్యరాయ్ నటించే అవకాశం ఉందని పద్మావతి చిత్ర బృందం చెబుతోంది.