Home జగిత్యాల సిఎం సహాయ నిధి పేదలకు వరం: మంత్రి కొప్పుల ఈశ్వర్

సిఎం సహాయ నిధి పేదలకు వరం: మంత్రి కొప్పుల ఈశ్వర్

Welfare Minister Koppula Eshwar

 

ధర్మపురి: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలాంటిదని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అనేక రకల వ్యాధుల భారినపడి ప్రైవేటు ఆసుపత్రులలో వేలాది రూపాయలు ఖర్చు చేసిన లబ్దిదారులకు మంజూరు అయిన రూ. 19,08 500 విలువ గల చెక్కులను ఆయన చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యంత సహాయం పొందిన వారిలో ధర్మపురి నియోజకవర్గం ముందుంటుందన్నారు. గత ఐదు సంవత్సరాల నుండి వేలాది మందికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించామని, పెద్ద పెద్ద జబ్బుల బారిన పడి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని వందలాది మందికి చికిత్స కోసం ముందస్తు ఎల్‌ఒసిలు ఇప్పించామని, అనేక సంక్షేమ పథకాలతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గంలోని వివిధ స్థాయి ప్రజా ప్రతినిధులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Aishwarya provided the CM Assistant Fund check