Search
Saturday 22 September 2018
  • :
  • :

వాస్తవాలను దాచకూడదు

Aishwarya Rai Bachchan on her biopic

భారీగా స్టార్‌డమ్ ఉన్నా దాన్ని ఏమాత్రం తలకెక్కించుకోని సినీ తారలు కొందరు ఉంటారు. వారెప్పుడు ప్రేక్షకుల మనసుల్ని దోచుకోవడమే కాదు తమ మాటలతో సామాన్యుల హృదయాల్ని కొల్లగొడుతుంటారు. ఇక తన అందం, అభినయంతో కోట్లాదిమందిని ఫిదా చేసిన ఐశ్వర్యారాయ్ ఎప్పుడూ కూల్‌గా ఉండటమే కాదు వివాదాలకు దూరంగా ఉంటుంది. వయసు మీద పడుతున్నా యంగ్ హీరోయిన్లతో పోటీపడే అందం ఐష్ సొంతం. యువ కథానాయికలు సైతం ఈర్షపడేంత సౌందర్యంతో మెరిసిపోయే ఈ భామ వీలైనంత వరకు ప్రాక్టికల్‌గా మాట్లాడటానికే ఇష్టపడుతుంది. ఇక ఐష్ జీవితాన్ని చూస్తే ఒక సినిమా కథకు సరిపోయేంత డ్రామా ఆమె లైఫ్‌లో కనిపిస్తుంది. ఒకప్పటి ఆర్కిటెక్చర్ స్టూడెంట్ గ్లామర్ ఫీల్డులోకి ప్రవేశించి ఇప్పుడు కోట్లాదిమంది అభిమాన తారగా నిలిచింది. ఆర్కిటెక్చర్ స్టూడెంట్ నుంచి మిస్ వరల్డ్ వరకు ప్రయాణం ఒక ఎత్తు అయితే బాలీవుడ్‌లో తిరుగులేని క్రేజీ హీరోయిన్‌గా రాణించడానికి ఐష్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఇప్పుడు నడుస్తున్న బయోపిక్‌ల కాలంలో ఐష్ బయోపిక్ తీస్తే బోలెడంత డ్రామాతో పాటు యువతకు స్ఫూర్తినిచ్చే అంశాలు ఇందులో ఎన్నో ఉంటాయి. ఇదే విషయాన్ని ఐశ్వర్యారాయ్‌ను అడిగితే ఆమె ఆసక్తికరంగా సమాధానమిచ్చింది. “నా బయోపిక్ తీస్తే వాస్తవాల్ని దాచకూడదన్నది నా అభిప్రాయం. నా జీవితం గొప్ప కథ అవుతుందని… ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుందని ఫిల్మ్‌మేకర్స్ భావిస్తే తప్పకుండా నా బయోపిక్ తెరకెక్కాలని కోరుకుంటాను”అని ఐష్ పేర్కొంది. అయితే ఐశ్వర్య జీవితంలో సల్మాన్, వివేక్ ఒబెరాయ్‌లతో ఆమె ప్రేమ వ్యవహారాలు అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ అందాల తార బయోపిక్‌లో వీటన్నింటినీ పొందుపరిస్తే సినిమా సంచలనంగా మారడం ఖాయం.

Comments

comments