Home తాజా వార్తలు వాజ్‌పేయిని గుర్తుచేసుకున్న ఐశ్వర్య…

వాజ్‌పేయిని గుర్తుచేసుకున్న ఐశ్వర్య…

Aishwarya Rai Bachchan paid tribute to Atal Bihari Vajpayee

హైదరాబాద్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌బచ్చన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వాజ్‌పేయిని గుర్తు చేసుకున్నారు. 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు బాలీవుడ్ స్టార్స్ శ్రీదేవి, ఐశ్వర్యలు వాజ్ పేయిని కలిశారు. ఆ ఫోటోలను ఐశ్వర్యరాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. వాజ్‌పేయిని ఎంతో గౌరవిస్తున్నట్లు, ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ఐశ్వర్య తన పోస్టులో వెల్లడించింది. ఆ ఫోటోలో వైట్ సల్వార్‌లో దివంగత నటి శ్రీదేవి, గ్రీన్ సారీలో ఐశ్వర్యరాయ్ లు వాజ్‌పేయితో ఇద్దరూ నవ్వుతూ కనిపించారు.