Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఫోటోలు తీయకండి ప్లీజ్.. కంటతడి పెట్టుకున్న ఐష్…

Aishwarya-Rai-Bachchan

ముంబయి: మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటీ ఐశ్వర్యరాయ్ బచ్చన్ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. తండ్రి కృష్ణారాజ్ రాయ్ జయంతి సందర్భంగా స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న వంద మంది చిన్నారులకు సోమవారం ముంబయిలోని సుష్రుషా ఆస్పత్రిలో ఆమె చికిత్స చేయించారు. అయితే ఐశ్వర్య వచ్చారనే విషయం తెలుసుకున్న మీడియా వర్గాలు ఆమె ఫోటోల కోసం గుమిగూడారు. దీంతో ఐష్ ఫోటోలు తీయొద్దని, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా అంటూ కంటతడి పెట్టుకున్నారు. ప్లీజ్ ఫోటోలు తీయకండి, నేను ఏ పని నిమిత్తం ఇక్కడికి వచ్చానో మీకు తెలీయదు. ఇది మూవీ ప్రీమియర్ షో కాదు, అలాగే పబ్లిక్ ఈవెంట్ కూడా కాదంటూ ఉద్వేగానికి లోనయ్యారు ఐష్.

Aishwarya Rai Bachchan slams paparazzi.

Comments

comments