Search
Friday 21 September 2018
  • :
  • :

అందాలొలకబోసిన ఐష్

aish

ఉరకలెత్తే ఉత్సాహానికి వయసుతో పనేంటి? మనసుండాలే కానీ అసలు డ్యాన్స్ చేయడానికి వయసు అడ్డంకి ఎలా అవుతుందని అంటోంది మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఐశ్వర్యారాయ్. ఐష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫనే ఖాన్’. ఈ చిత్రంలోని మొహబ్బత్… గీతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. 40 ప్లస్ వయసులోనూ ఐష్ హోయలు చూసి కుర్రకారు మతి భ్రమిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఒంపుసొంపుల వయ్యారాల హంపీ శిల్పం ప్రాణం పోసుకొని నర్తించిందా… అన్నంత అందంగా ఉంది ఆమె నర్తన. అందాలొలకబోస్తూ ఈ బ్యూటీ చేసిన డ్యాన్సులు సినిమాకే హైలైట్‌గా నిలవడం ఖాయం. ‘ధూమ్ 2’లో ధూమ్మచాలే… అంటూ ఐష్ చేసిన డ్యాన్సులు యూత్‌ను ఉర్రూతలూగించాయి. మళ్లీ అలాంటి ఫీట్ రిపీట్ చేసింది ఈ భామ. ఈ పాటకు ప్రఖ్యాత పాప్ సింగర్ బియాన్స్, కొరియోగ్రాఫర్ ఫ్రాంక్ గాట్సన్ జూనియర్ కొరియోగ్రఫీ అందించడం విశేషం.

Comments

comments