Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఐష్‌ది ‘ప్లాస్టిక్’ అందమా?

Aishwarya Rai Plastic Surgery

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ అందచందాల గురించి ఎంతై నా చెప్పవచ్చు. ఈ భామ తన అందంతో ఎన్నో సంవత్సరాలుగా ప్రే క్షకులను అలరిస్తూనే ఉంది. అయితే ఐష్ అందం సహజసిద్ధమైనది కాదని… ఆమెది ప్లాస్టిక్ అందమనే వాదన కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉంది. విశ్వసుందరి కాకముందే ఐశ్వర్యారాయ్ తన ముఖంలో కొద్దిపాటి మార్పులు చేయించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించిందని అప్పట్లో మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇదే విషయంపై బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయాన్ని ఐష్‌ను అడిగితే ఆమె ప్రతిసారి దాటవేస్తూ వచ్చేది. తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానన్న దాంట్లో నిజం ఉందని కానీ,

లేదని కానీ ఆమె చెప్పలేదు. తాజాగా మరోసారి ఐశ్వర్య ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. దీనిపై స్పందిస్తూ… “20 ఏళ్ల క్రితం ఇదే ప్రశ్న అడిగినప్పుడు, ఇప్పుడు ఒకే సమాధానం చెబుతున్నాను. అందం కాపాడుకోవడానికి ప్రతి మహిళ ఏదో చేస్తుంటుంది. ఆహార నియమాల నుంచి ప్రతీది పాటిస్తాం”అని పేర్కొంది ఐశ్వర్యారాయ్. అయితే ఐష్ నిజంగానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని అంత అందగత్తెగా మారినా అభిమానులు ఇప్పుడు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఆమెను ఓ ఆరాధ్య దేవతగా భావించే అభిమానులు ఎందరో ఉన్నారు.

Comments

comments