Search
Saturday 22 September 2018
  • :
  • :

అదరగొడుతున్న ఐశ్వర్యా రాయ్

aishwarya-raiప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ ఇప్పుడు బాలీవుడ్‌లో సెన్సేషనల్ హీరోయిన్‌గా నిలిస్తోంది. పెళ్లయిన తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్‌నిచ్చిన ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్‌లో తాజాగా సంచలనం సృష్టిస్తోంది. 40 ప్లస్ వయసులో 30 ప్లస్ హీరోతో బాలీవుడ్ మూవీలో రొమాన్స్ చేసి అదరగొడుతోంది. ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలో ఐశ్వర్యారాయ్… రణబీర్ కపూర్‌తో చేసిన హాట్ రొమాన్స్ యువత మతులు పోగొడుతోంది. ఈ చిత్రంలోని ‘బులెయా…’ అనే సాంగ్‌లో ఐశ్యర్య, రణబీర్‌ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంది. సూఫీ స్టయిల్ లిరిక్స్‌లో ప్రీతమ్ అందించిన రాక్ స్టైల్ మ్యూజిక్‌తో ఈ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ పాట ఒకెత్తయితే పాట విజువల్స్ మరో ఎత్తు. ఈ పాటలో ఐశ్వర్యారాయ్… రణబీర్‌ను ముద్దులు పెట్టుకోవడంతో పాటు ఇతర హాట్ రొమాంటిక్ సీన్లు యూత్‌ను మైమరపిస్తాయి. ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలిచిపోయింది. అక్టోబర్ 28న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ఐశ్వర్య కెరీర్‌లో మరచిపోలేని చిత్రంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Comments

comments