Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్ర

AITUC

ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ 

మన తెలంగాణ/ఆదిలాబాద్ టౌన్: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి విదేశీ సంస్థలు, ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తు మళ్లీ బానిసత్వం వైపు భారత దేశాన్ని బిజెపి ప్రభుత్వం తీసుకెళుతుందని ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఐటియుసి  జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు చేస్తుందన్నారు. ప్రభుత్వ సంస్థల్లో 58వేల కోట్ల వాటాలో 28 కోట్ల వాటాను అమ్మేందుకు యత్నాలు సాగుతున్నాయని, దీన్ని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు.

అంతే కాకుండా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. నల్లధనం పేరుతో ఆర్‌ఎ స్‌ఎస్, బిజెపి కలిసి పెద్ద నోట్లను రద్దు చేసి సామాజన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. దీంతో ర్మి కులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. కార్మికులకు వచ్చే వేతనాలు చూస్తే వారి భోజనాలకు కూడా సరిపోవ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్రంగా ఉన్న ఆర్‌బిఐను తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రజలతో చెలగాట మాడుతున్నారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం చెల్లిం చాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో మూత పడిన పరిశ్రమలను రిపెన్ చేస్తామని చెబుతున్నారే తప్ప వాటిపై స్పష్టత లేదని అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆటో డ్రైవర్‌లకు శాపంగా మారిన పెనాల్టీ చట్టాన్ని ఉపసంహరించాలని పలు తీర్మానాలు చేశారు. దీనిపై ఉద్యమ కార్యాచరణ రూపొందించి హక్కులను సాధించేందుకునేందుకు పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి  నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు గోవర్ధన్, చంద్రకళ, రాజు, రాములు, గంగయ్య, రాజన్న, నయీం,  జంగు, రఘునంద్, దేవిదాస్, గోదావరి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments