Home జాతీయ వార్తలు ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తా..

ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తా..

rahaneముంబయి : జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో బ్యాటి ంగ్ చేయమన్న చేయడానికి సిద్ధంగా ఉంటానని మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానె అన్నాడు. జట్టు మేనేజ్‌మెం ట్.. రహానెను ఐదోస్థానంలో కాకుండా మూడోస్థానంలో బ్యాటింగ్ దింపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అ యితే రహానె మాత్రం విమర్శలను తేలిగ్గా తీసిపారేశాడు. నాకు బ్యాటింగ్ స్థానం పెద్ద సమస్య కాదు. జట్టు మేనేజ్ మెంట్ ఈ ఏస్థానంలో బ్యాటింగ్ చేయమన్నా.. చేయడానికి నేను సిద్ధం. శ్రీలంకలో మూడోస్థానంలో బ్యాటింగ్ చేయ డం బాగా ఆశ్వాదించాను. ఈ స్థానంలోనే జట్టును గెలిపిం చే శతకం నమోదుచేశానని చెప్పాడు. ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్యాటింగ్ చేయగల ఆటగాడొకడు జట్టులో ఉన్నాడని నాపై జట్టు మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచింది.

ఆ నమ్మకం నాకే కాదు. జట్టుకు కూడా మంచిదే. మూ డోస్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడికి సరైన మనసిక స్థితి ముఖ్యం. ఈ స్థానంలో క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. బంతి కొత్తగా ఉంటుంది కాబట్టి బౌ లర్లను గౌరవించాలి. అదే 5-6 స్థానాల్లో బ్యాటింగ్ చేయ డం చాలా సులువు. ఎందుకంటే అప్పటికే బంతి కొత్తదనా న్ని కోల్పోవడమే కాదు. బౌలర్లు బాగా అలిసిపోయి ఉంటా రని రహానె అన్నాడు.